చిరంజీవి పాట పాడితే సినిమా ఆడదా? ఆ ఫలితం చూశాక మెగాస్టార్ సంచలన నిర్ణయం ?

First Published | Nov 11, 2024, 10:14 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి నటుడిగానే కాదు, కొన్ని సినిమాలకు వాయిస్‌ ఓవర్ ఆర్టిస్ట్ గానూ సేవలందించారు. అలాగే ఆయన పాటలు కూడా పాడారు. కానీ ఫలితాలు చూసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

మెగాస్టార్‌ చిరంజీవి తన 156 సినిమాల కెరీర్‌లో ఎన్నో విజయాలు చూశారు, ఎన్నో ఫ్లాప్‌లు చూశారు. అందులో డిజాస్టర్లు ఉన్నాయి. బ్లాక్‌ బస్టర్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. యావరేజ్‌ మూవీస్‌ చాలానే ఉన్నాయి. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు పేర్చుకుంటూ తన మెగా కోటని నిర్మించుకున్నారు చిరంజీవి. మహావృక్షంలా ఎదిగారు. ఇప్పుడు ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా నీడనిస్తున్నారు. ఎంతో మందిని పైకి తీసుకువస్తున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Chiranjeevi

చిరంజీవి తన నాలుగున్నర దశాబ్దాల కెరీర్‌లో నటుడిగా ప్రయోగాలు చేశారు. కానీ టెక్నీకల్‌గా ప్రయోగాలు చేయలేదు. కొన్ని సినిమాలకు వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఈ మధ్య సినిమాలను నిర్మించారు. ఇప్పుడు వాటికి కూడా దూరంగానే ఉంటున్నారు.

అయితే తన కెరీర్‌లో కొత్తగా, తనకు సెట్‌ కాని ప్రయోగం ఒకటి చేశారు. అందులో మొదటిసారి ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత దారుణమైన ఫలితాన్ని ఫేస్‌ చేశారు. దీంతో ఇక కంప్లీట్‌గా దానికి గుబ్‌ బై చెప్పారు. మరి చిరంజీవి చేసిన ఆ ప్రయోగం ఏంటి? ఎందుకు నో చెప్పాడనేది చూస్తే.. 
 

Latest Videos


మెగాస్టార్‌ చేసిన ఆ ప్రయోగం ఆయన సింగర్‌గా మారడం. అవును చిరంజీవి పాటలు కూడా పాడారు. తన సినిమాల్లోనే ఆయన పాటలు పాడి అభిమానుల్ని, ఆడియెన్స్ ని అలరించారు. చిరంజీవి పాట పాడాడంటే అప్పట్లో ఆయా సినిమాలకు విపరీతమైన క్రేజ్‌, హైప్‌ వచ్చింది. కానీ ఫలితాలు డిజప్పాయింట్‌ చేయడం విచారకరం.

చిరంజీవి ఫస్ట్ టైమ్‌ `మాస్టర్‌` సినిమాలో పాట పాడారు. ఇందులో `తమ్ముడు అరే తమ్ముడు.. తికమక దిగులే ప్రేమంటే` అనే యూత్‌ఫుల్‌ సాంగ్‌ని ఆలపించారు. దీన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, దేవా సంగీతం అందించారు. ఈ పాటని ఫ్యాన్స్ బాగానే ఎంజాయ్‌ చేశారు. కానీ కామన్‌ ఆడియెన్స్ మాత్రం తీసుకోలేకపోయారు.

చిరంజీవి వాయిస్‌ పెద్దగా ఎక్కలేదు. 1997లో విడుదలై ఈ సినిమా యావరేజ్‌గానే ఆడింది. ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. యాక్షన్‌ డోస్‌ తగ్గడం, కూల్‌గా సినిమా ఉండటంతో ఆడియెన్స్ రిసీవ్‌ చేసుకోలేకపోయారు. 
 

ఆ తర్వాత 2000లో వచ్చిన `మృగరాజు` సినిమాలోనూ మరోసారి పాట పాడారు చిరంజీవి. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో `చాయ్‌ చాయ్‌ చూడరా భాయ్‌` అనే పాటని అలరించారు. `మాస్టర్‌` సినిమాలోని పాటకంటే ఇందులో చిరంజీవి పాడిన పాట ఎంతో బాగుంది. ఆకట్టుకుంది. ఆడియెన్స్ మాత్రం థియేటర్లలో బాగా ఎంజాయ్‌ చేశారు.

కానీ సినిమా ఫలితం తేడా కొట్టింది. చిరంజీవి స్టయిల్‌కిది పూర్తి భిన్నంగా ఉంది. దీంతో ఆడియెన్స్ రిజెక్ట్ చేశారు. సినిమా డిజాస్టర్‌ అయ్యింది. సో ఈ ఫలితం చూశాక మెగాస్టార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఇక పాటల పాడొద్దని నిర్ణయించుకున్నారట. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఇంకెప్పుడు ఆ సాహసం చేయలేదు మెగాస్టార్‌. 
 

చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` సినిమాలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సురభి, ఈషా చావ్లా వంటి కథానాయికలు స్పెషల్‌ రోల్స్ లో మెరవబోతున్నారు. ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ కి స్కోప్‌ చాలా ఉందట.  అందుకోసం డిలే అవుతుందని, సంక్రాంతికి రావాల్సిన మూవీని వాయిదా వేశారు.  

అంతేకాదు సినిమాకి సంబంధించి ఎక్కువగా చిరంజీవినే టేక్‌ కేర్‌ తీసుకుంటున్నారట. ప్రముఖ దర్శకులు కూడా సపోర్ట్ గా ఉన్నారని తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతుంది. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు. 

Read more: తప్పు తెలుసుకుని రియాలిటీలోకి వచ్చిన మంచు మనోజ్‌, తండ్రి మోహన్‌బాబు నేర్పిన పాఠాలు ఇంప్లిమెంట్‌

also read: అఖిల్‌ కి మాత్రం పద్ధతులు నేర్పించి నాగార్జున చేసిన పని ఇదేనా? ఆయనకు లేని రూల్స్ కొడుక్కేందుకు ?

click me!