తప్పు తెలుసుకుని రియాలిటీలోకి వచ్చిన మంచు మనోజ్‌, తండ్రి మోహన్‌బాబు నేర్పిన పాఠాలు ఇంప్లిమెంట్‌

First Published | Nov 11, 2024, 8:09 PM IST

మంచు మనోజ్‌ పంథాని మార్చారు. తాను హీరోగా సర్వైవ్‌ కాని పరిస్థితుల్లో తండ్రిని అనుసరిస్తున్నాడు. మోహన్‌బాబు బాటలోనే ఆయన వెళ్తున్నట్టు తెలుస్తుంది. 
 

మంచు మనోజ్‌ హీరోగా ఓ మెరుపు మెరిసిన నటుడు. మంచు మోహన్‌బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మెప్పించాడు. ప్రారంభంలో ఆయన సినిమాలు బాగానే ఆడాయి. మంచి ఆదరణ పొందాయి. హిట్లు కూడా అయ్యాయి. కానీ ఆ తర్వాత సక్సెస్‌ ఆమడదూరం పారిపోయింది. వరుసగా నిరాశకి గురి కావాల్సి వచ్చింది. దీనికితోడు వ్యక్తిగత జీవితంలోనూ డిస్టర్బ్ కావాల్సి వచ్చింది. దీంతో సినిమాలకే బ్రేక్‌ ఇచ్చాడు మనోజ్. ఆరేడు ఏళ్లుగా ఆయన సినిమాలు చేయడమే మానేశాడు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు ప్రకటించినా అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. పట్టాలెక్కలేదు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ క్రమంలో మనోజ్‌ మొదటి భార్యకి విడాకుల ఇచ్చి ఆ మధ్యనే రెండో పెళ్లి చేసుకున్నాడు. భూమా మౌనికా రెడ్డిని ఆయన సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి జోష్‌ చూపించారు. కొన్నాళ్లు `ఉస్తాద్‌` అనే టాక్‌ షో చేశాడు. అది ఫర్వాలేదనిపించింది. కానీ కంటిన్యూ చేయలేకపోయాడు. ఆ తర్వాత ఫ్యామిలీ గొడవలు బయటకు వచ్చాయి. మళ్లీ స్ట్రగుల్‌ అనే పరిస్థితి వచ్చింది.

సోలో హీరోగా సినిమాలు పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రూట్‌ మార్చాడు మనోజ్‌. హీరోగానే కాదు, నెగటివ్‌ రోల్స్, ఇంపార్టెంట్స్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ మధ్య `మిరయ్‌` చిత్రంలో నెగటివ్‌ షేడ్‌ ఉన్న ఇంపార్టెంట్‌ రోల్‌లో నటించేందుకు ఒప్పుకున్నాడు. ఆ పాత్ర గ్లింప్స్ వచ్చి ఆకట్టుకుంది. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించగా, కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. 
 


ఇప్పుడు మరో సినిమాని ప్రకటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నారా రోహిత్‌లు కలిసి నటిస్తున్న `భైరవం` చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు మనోజ్‌. తాజాగా ఈ మూవీని ప్రకటించారు. మనోజ్‌ ప్రీ లుక్‌ విడుదల చేశారు. రేపు ఆయన ఫస్ట్ లుక్‌ రాబోతుంది. ఇందులోనూ మనోజ్ ది నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర అని తెలుస్తుంది.

విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని కే కే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉందని తెలుస్తుంది. ఇలా వరుసగా మంచు మనోజ్‌ నెగటివ్‌ రోల్స్ చేయడం ఆశ్చర్యంగా మారింది. మొత్తంగా ఆయన తన పంథాని మార్చుకున్నట్టు అర్థమవుతుంది.

అంతేకాదు రియాలిటీలోకి వచ్చినట్టు తెలుస్తుంది. సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎలా ఉండాలనేది తండ్రి నుంచి నేర్చుకుని ఇప్పుడు ఇంప్లిమెంట్‌ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనిపై మనోజ్‌ మాట్లాడుతూ వెయిట్‌ చేశాను, అలసిపోయాను, కాలం విలువ తెలుసుకున్నాను. ఈ సినిమా చేస్తున్నా` అని `మిరయ్‌` సినిమా ఈవెంట్‌లో తెలిపారు మనోజ్‌. జీవితం నేర్పిన పాఠం నుంచి నేర్చుకుని ఇలా టర్న్ తీసుకున్నాడని అర్థవుతుంది.  
 

మోహన్‌బాబు మొదట చిన్న చిన్న పాత్రలు చేశాడు. విలన్‌గానూ నటించాడు. మెప్పించాడు, స్టార్‌ గా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నాడు. కొన్నాళ్లు హీరోగా నటించిన ఆయనకు కూడా మళ్లీ దెబ్బలు తీనాల్సి వచ్చింది. కెరీర్‌ డౌన్‌ అయ్యింది. దీంతో మళ్లీ విలన్‌గా పాత్రలు చేశారు. మళ్లీ పుంజుకున్నారు. మళ్లీ హీరోగా సినిమాలు చేశారు. విశేష గుర్తింపు, స్టార్‌ స్టేజస్‌ని సొంతం చేసుకున్నారు. కలెక్షన్‌ కింగ్‌గా ఎదిగాడు. టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ లో ఒకరిగా రాణించారు మోహన్‌బాబు. 
 

ఇప్పుడు మంచు మనోజ్‌ సైతం అదే దారిలో వెళ్తున్నట్టు తెలుస్తుంది. హీరోగా సినిమాలు వర్కౌట్‌ కాని పరిస్థితుల్లో, నిర్మాతలు ముందుకు రాని పరిస్థితుల్లో తనని తాను నిరూపించుకునేందుకు మంచు మనోజ్‌ కూడా తండ్రి బాటనే ఎంచుకున్నాడని అర్థమవుతుంది. `మిరయ్‌`, `భైరవం` చిత్రాల్లో కూడా ఆయన నెగటివ్‌ రోల్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలు హిట్‌ అయితే, మంచు మనోజ్ కి పేరొస్తే మళ్లీ ఆయన హీరోగా టర్న్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

దీనిపై ఆయన అభిమానులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్న మంచు విష్ణు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలనే సలహాలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం కూడా సందర్భాన్ని బట్టి ఇలా టర్న్ తీసుకుని ఎప్పుడూ ఆడియెన్స్ దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా `కన్నప్ప` సినిమాని రూపొందిస్తున్నారు. 

read more: రహస్యంగా దర్శకుడు క్రిష్‌ రెండో పెళ్లి.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే? మొదటి భార్య ఎలా విడిపోయిందంటే?

also read: అఖిల్‌ కి నీతులు నేర్పి నాగార్జున చేసిన పని ఇదేనా? ఆయనకు లేని రూల్స్ కొడుక్కేందుకు ?
 

Latest Videos

click me!