పుష్ప 2 సాంగ్ కోసం శ్రీలీల అంత డిమాండ్ చేసిందా..? అల్లు అర్జున్ తో ఐటం సాంగ్ కి ఎంత రెమ్యునరేషన్ ..?

First Published | Nov 11, 2024, 8:07 PM IST

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో ఒక పాటకు శ్రీలీల డ్యాన్స్ చేశారు. మరి ఆ పాటకు ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా..? 

sreeleela

ఇండస్ట్రీ లో ఓవర్ నైట్ స్టార్లు అయినవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ అదృష్టం కోటి మందిలో ఒకరిద్దరికి మాత్రమే దక్కుతుంది. అటువంటి లక్కీ హీరోయిన్లలో శ్రీలీల కూడా ఒకరు. అది కూడా ఒక ప్లాప్ మూవీతో ఆమె పాపులర్ అయ్యింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ జంటగా  పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది  ఈ అచ్చ తెలుగు అమ్మాయి.  ఇక తనకంటే దాదాపు 30 ఏళ్లకు పైగా పెద్దవాడైన రవితేజతో ధమాకా సినిమా చేసి.. స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

Also Read: బాలయ్య ముందు నోరు జారిన అల్లు అర్జున్

సమంత

ఈసినిమాలో ఆమె డాన్స్ కు జనాలు పిచ్చెక్కిపోయార. రవితేజ ఎనర్జీని కూడా దాటుకుని డాన్స్ లో పోటీ ఇచ్చింది శ్రీలీల. ఇక ధమాకా తరువాత ఈ బ్యూటీ  చేతినిండా సినిమాలతో క్షణ కాలం తీరిక లేకుండా గడిపింది. కాకపోతే స్టార్ హీరోయిన్ అవ్వడం ఒక ఎత్తయితే.. అది నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఆ పనిలో శ్రీలీల తడబడుతుంది. దాంతో ఈ బ్యూటీ కెరీర్ కాస్త స్లో అవుతుంది. 

మరీ ముఖ్యంగా కథలు సెలక్షన్ సరిగా లేకపోవడం, సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయకపోవడంతో..  వరుస డిజాస్టర్స్ ను చూడాల్సి వస్తోంది శ్రీలీల. ఈమధ్య కాలంలో భగవంత్ కేసరి తప్పించి శ్రీలీల ఖాతాలో పెద్దగా హిట్ సినిమాలు లేవనేచెప్పాలి.  దాంతో శ్రీలీల కూడా కృతీ శెట్టి మాదిరిగానే డౌన్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈక్రమంలోనే కాస్త రూట్ మార్చి ప్రయత్నాలు మొదలు పెట్టింది శ్రీలీల. 

Also Read: 90ల నాటి ఫేవరెట్ 'శక్తిమాన్' 9 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నాడు, ఎప్పటి నుంచో తెలుసా..?


పుష్ప సినిమా

గతంలో ఐటమ్ సాంగ్స్ గురించి ఆమెకు ప్రశ్నలు ఎదురైతే.. ఇప్పట్లో వాటి జోలికి వెళ్ళను.. నేను సినిమాలతో బిజీగా ఉన్నాను అని చెప్పిన ఆమె.. ఇక తాజాగా పుష్ప2 లో అవకాశం రాగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది. ఇలా అయినా.. కాస్త లైమ్ లైట్ లో ఉండొచ్చు అనుకుందో లేక.. పుష్ప 1 లో సమంతకు వచ్చినంత పేరు వస్తుంది అని ఆపడిందో తెలియదు కాని.. శ్రీలీలపుష్ప 2 : ది రూల్’ లో ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. 

ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయ్యాక మొదటి కాపీ ని సిద్ధం చేసి సెన్సార్ కి పంపనున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ ఐటెం సాంగ్ చేసేందుకు శ్రీలీల  ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో హీరోయిన్ గా నటించడానికి అయితే మూడు నుంచి నాలుగు కోట్లు తీసుకుంటుందట శ్రీలీల. ఈ సాంగ్ కోసం ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేసిందని టాక్ నడుస్తోంది. 

Also Read: భర్తలను మించి సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

పుష్ప 2 సినిమా

అయితే ఫైనల్ గా  తను అనుకున్నట్టే 2 కోట్లు తీసుకుని ఈసాంగ్ చేస్తుందని.. ఫిల్మ్ నగర్ సర్కిల్ లో  పెద్ద చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా శ్రీలీల ఎమో కాని డాన్సర్ గా మాత్రం ఆమెకు మస్త్ క్రేజ్ ఉంది. గుంటూరు కారం సినిమాలో మండపెట్టి సాంగ్ కు శ్రీలీల చేసిన డాన్స్ మర్చిపోలేకపోతున్నారు కుర్రకారు. మహేష్ బాబు కూడా వామ్మో ఈపిల్లను డాన్స్ లో అందుకోవడం చాలా కష్టం అని స్టేజ్ మీదనే చెప్పాడు. 

పుష్ప 2 శ్రీలీల

సెపరేట్ గా హీరోయిన్ లేకుండా ఈసినిమాలో హీరోయన్ తోనే ఐటమ్ సాంగ్ చేసి అదరగొట్టారంటే డాన్స్ విషయంలో శ్రీలీల డిమాండ్ ఏంటో అర్ధం అవుతుంది.   అలాంటి అద్భుతమైన డ్యాన్సర్ కి అల్లు అర్జున్ లాంటి డాన్సింగ్ హీరో తోడైతే అల్లాడించేస్తారు అందులో సందేహం లేదు. ఇక ఈ సాంగ్ కు  ఇండియా మొత్తం షేక్ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ పుష్ప 2 కోసం దేశం అంతా సినిమా ప్రియులు ఎదురు చూస్తున్నారు. 

ఈ పాట వల్ల అదనపు లాభం కలుగుతుంది కాబట్టే నిర్మాతలు కూడా శ్రీలీల ఎంత రెమ్యూనరేషన్ అడిగితే అంత ఇవ్వడానికి అంగీకరించారు.  సో ఈ క్రేజ్ వల్లే శ్రీలీలఅంత డిమాండ్ చేసిందటున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఈన్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.  త్వరలోనే ఈ పాటకి సంబంధించిన లిరికాల్  వీడియో సాంగ్ రానుంది. సినిమా విడుదలకు వారం రోజుల ముందు ఈ పాటని విడుదల చేయనున్నారు 

Latest Videos

click me!