చిరంజీవి సంచలన నిర్ణయం.. పేరు మార్పు.. కారణమదేనా?.. మరి ఆ విమర్శలేంటి?

First Published Jul 5, 2022, 7:26 PM IST

మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. `గాడ్‌ ఫాదర్‌` కోసం తన పేరు మార్చుకున్నారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) `ఆచార్య`తో నిరాశ పరిచిన నేపథ్యంలో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో భారీ ట్రీట్‌ ఇచ్చేందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన `గాడ్‌ ఫాదర్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం `గాడ్‌ ఫాదర్‌`(God Father)లో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సాల్ట్ అండ్‌ పెప్పర్‌ టోన్‌లో ఉన్న చిరంజీవి లుక్‌ ఆకట్టుకుంటుంది. మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్‌లా ఉందని అంటున్నారు. ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది.
 

ఇదిలా ఉంటే ఈ లుక్‌, మాతృకతో పోలికలు పెడుతున్నారు నెటిజన్లు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `లూసీఫర్‌`కిది రీమేక్‌. మోహన్‌లాల్‌ హీరోగా నటించారు. అక్కడ విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో `గాడ్‌ ఫాదర్‌`గా రీమేక్‌ చేస్తున్నారు. చిరంజీవితోపాటు సల్మాన్‌ ఖాన్‌, సత్యదేవ్‌, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌ బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌, ఫస్ట్ గ్లింమ్స్ ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో కొంత అసంతృప్తికి తావిస్తుంది. మలయాళం `లూసీఫర్‌` ఫస్ట్ లుక్‌లో మోహన్‌లాల్‌ లుక్‌తో పోల్చితే చిరంజీవి ఫస్ట్ లుక్‌ తగ్గిపోయిందని, ఆ స్థాయిలో లేదనే టాక్‌ వినిపిస్తుంది.

అదే సమయంలో లుక్‌ అంతగా స్ట్రైకింగ్‌గా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంకో వైపు సంగీత దర్శకుడు థమన్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ లో వచ్చే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ వరుణ్‌ తేజ్‌ నటించిన `గని` సినిమాలోని టైటిల్‌ ట్రాక్‌ సేమ్‌ ఉన్నాయని, దాన్నే కాపీ కొట్టారని అంటున్నారు. 

ఇవన్నీ ఓ ఎత్తైతే.. చిరంజీవి ఫస్ట్ టైమ్‌ పేరు మార్చుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఫస్ట్ గ్లింమ్స్ లో చిరంజీవి పేరులో ఇంగ్లీష్‌ లెటర్స్ లో ఒక అక్షరం యాడ్‌ చేశారు. `CHIRANJEEVI`కి బదులుగా `CHIRANJEEEVI` అని ఉంది. అంటే `E` ఎక్కువగా కనిపిస్తుంది. మూడు `ఈ`లున్నాయి. ఇదే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది.

నలభై ఏళ్ల కెరీర్‌లో చిరంజీవి ఎప్పుడూ పేరు మార్చుకుంది లేదు. `మాస్టర్‌`, `బాస్‌`, `బిగ్‌బాస్‌`, `మెగాస్టార్‌` ఇలా ఆయన బిరుదులు మారాయి. కానీ పేరు మారలేదు. మొదటిసారి చిరంజీవి పేరు మార్చుకోవడం చర్చనీయాంశమవుతుంది. న్యూమరాలజీ ప్రకారం చిరంజీవి పేరు మార్చుకున్నట్టు తెలుస్తుంది.

`ఖైదీ నెంబర్‌ 150` తర్వాత చిరంజీవి సరైన సక్సెస్‌ లేదు. `సైరా` మూవీ క్రిటికల్‌గా ఆకట్టుకుంది. కానీ కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇటీవల వచ్చిన `ఆచార్య` డిజాస్టర్‌ అయ్యింది. దీంతో చిరంజీవి హిట్‌ కోసం పేరు మార్చుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  కానీ అందులో నిజం లేదని, ఎడిటర్‌ తప్పిదం వల్లే జరిగిందని చిత్ర బృందం తెలిపింది. పేరు మార్పులో నిజం లేదని వెల్లడించారు. ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా చూసుకుంటామని వెల్లడించింది.

click me!