ప్రభాస్ కు రెండు మేజర్ సర్జరీలు జరిగాయా.. రామ్ చరణ్ చెప్పిన రహస్యం ఏంటంటే..?

First Published | Nov 4, 2024, 5:15 PM IST

ప్రభాస్ కు రెండు ఆపరేషన్లు జరిగాయి.. అది కూడా మేజర్ వి. కారణం ఏంటి..? ఇంతకీ  ఈ విషయం ఎవరు రివిల్ చేశారో తెలుసా.. ? మెగా పవన్ స్టార్ రామ్ చరణ్. ఇంతకీ రామ్ చరణ్ ఏమన్నారు. ప్రభాస్ కు జరిగిన సర్జరీ ఏంటి..? 

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగడవ అంటే అంత ఆషఆమాషి వ్యవహారం కాదు. స్టార్లు.. సూపర్ స్టార్లు ఊరికే అయిపోరు. వాళ్లేదో ఏసీగదుల్లో.. ఫారెన్ కార్లలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారని అంతా అనుకుంటుంటారు. కాని స్టార్లు గా ఎదగడానికి.. ఆ స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడానికి వాళ్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. హీరోలు అయితే తమ స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడం కోసం.. అభిమానులను అలరించడం కోసం.. వారి అంచనాలు తప్పకుండా జాగ్రత్తపడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. 

అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలో తమ పాత్రల కోసం ఎంత రిస్క్ చేస్తుంటారో తెలిసిందే. తమిళ హీరోల సంగతయితే చెప్పనక్కర్లేదు. ఇక ఈ విషయంలో పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అంతే. ఎంతో రిస్క్ చేసి కొన్ని పాత్రలు చేశారు ప్రభాస్.దాని వల్ల ఎన్నో సార్లు అనారోగ్య సమస్యలు ఫేస్ చేసి..కొన్ని సర్జరీలు కూడా చేయించుకున్నారట. 


Prabhas, Ramcharan

ఈ విషయాన్ని ప్రభాస్ చెప్పలేదు. చెప్పింది ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అవును సినిమా వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో వివరిస్తూ.. ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్. ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమా కోసం తాము ఎంత కష్టపడతామో వివరించారు. రిస్క్ షార్ట్స్ తీస్తాము.. ఆటైమ్ లో ఒక్కోసారి మేజర్ ఇంజ్యూరీస్ అవుతుంటాయి. 

దాని వల్ల కొన్నిరిస్క్ లు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అయినా సరే సినిమా కోసం అన్ని భరిస్తుంటాము అన్నారు రామ్ చరణ్. నాకు తెలుసు.. ప్రభాస్ కు రెండు సర్జరీలు అయ్యాయి. రెండూ.. షోల్డర్ సర్జరీలే అయ్యాయి. అయినా సరే అంత రిస్క్ చేస్తున్నా సరే.. తెల్లారి ఆ బాధను మర్చిపోయి షూటింగ్స్ కు వస్తుంటాము. ఇదంతా అభిమానుల కోసమే అని చెపుతూ ఆవేదన చెందారు రామ్ చరణ్. 
 

South Celebrities

సినిమాల కోసం వారుపడే బాధలు వివరించారు. కొంత మందిలో ఉండే అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు రామ్ చరణ్. అలా కష్టపడబట్టే రామ్ చరణ్ కాని, ప్రభాస్ కాని, బన్నీ, ఎన్టీఆర్ లాంటివారు పాన్ ఇండియా స్టార్లుగా వెలిగిపోతున్నారు. ఇక రామ్ చరణ్ విషయం చూస్తే.. ఆయన ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

ఈసినిమా తరువాత ఆయన బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ఓపెనింగ్ అయిపోయింది. రెగ్యూలర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది.  అటు ప్రభాస్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు.  కల్కీ సినిమా ఇచ్చిన బూస్ట్ తో దూసకుపోతున్నాడు రెబల్ స్టార్. 

రాజాసాబ్ షూటింగ్ అయిపోవస్తోంది. హనూరాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ షూటింగ్ హడావిడి లేకుండా సీక్రేట్ గా స్టార్ట్ అయ్యింది. ఇక సందీప్ వంగ స్పిరిట్ తో పాటు.. సలార్ 2, కల్కీ2 సినిమాలు కూడా షూటింగ్ చేయాల్సి ఉంది. ఈలెక్కడన ఓ ఐదారేళ్లు ప్రభాస్ ఫుల్ బీజీ.. చేతికి అందడం కష్టమే అని చెప్పాలి.  

Latest Videos

click me!