సైనికుల ధైర్యం, త్యాగం, దేశభక్తిని చూపించేందుకు ఎన్నో అద్భుతమైన భారతీయ చిత్రాలు తెరకెక్కించబడ్డాయి. అందులో అత్యంత ప్రముఖమైన టాప్ 10 మిలిటరీ సినిమాల జాబితాని ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా యుద్దాలు, ఆర్మీకి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని వారాల క్రితం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆర్మీ, మిలటరీ ఆపరేషన్స్, యుద్దాలకి సంబంధించిన చిత్రాల గురించి నెటిజన్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైనికుల ధైర్యం, త్యాగం, దేశభక్తిని చూపించేందుకు ఎన్నో అద్భుతమైన భారతీయ చిత్రాలు తెరకెక్కించబడ్డాయి. అందులో అత్యంత ప్రముఖమైన టాప్ 10 మిలిటరీ సినిమాల జాబితాని ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. వీటిలో ఘాజి, మేజర్ లాంటి తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.
211
బోర్డర్ (1997)
JP దత్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా 1971 ఇండో-పాక్ యుద్ధంలోని లాంగేవాలా పోరాటం ఆధారంగా రూపొందింది. ధైర్యం, స్నేహం, త్యాగం ప్రధానాంశాలుగా కనిపిస్తాయి.
311
ఉరి : ది సర్జికల్ స్ట్రైక్ (2019)
2016 ఉరి దాడికి ప్రతిగా భారత సైన్యం చేసిన పాక్ ఉగ్ర స్థావరాలపై సర్జికల్ దాడుల చేపట్టింది. ఈ సంఘటన ఆధారంగా ఆదిత్య ధార్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో ఉరి చిత్రం తెరకెక్కి సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, దేశభక్తి అంశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి.
హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా ఒక యువకుడు సైన్యంలో చేరి ఎలా జీవితాన్ని మార్చుకుంటాడన్న దానిపై ఆధారంగా ఉంటుంది. కార్గిల్ యుద్ధం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
511
షేర్షా (2021)
కెప్టెన్ విక్రమ్ బత్రా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కార్గిల్ యుద్ధంలో ఆయన చూపిన ధైర్య సాహసాలని చూపించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించారు.
611
ఘాజీ (2017)
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1971 యుద్ధ సమయంలో ఇండియన్ నేవీ, పాకిస్తాన్ నౌకల మధ్య జరిగిన అండర్‌వాటర్ వార్‌ను ఆధారంగాఈ చిత్రాన్ని రూపొందించారు. అండర్ వాటర్ వార్ నేపథ్యంలో రూపొందిన అద్భుతమైన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ మూవీలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించారు.
711
మేజర్ (2022)
26/11 ముంబయి దాడులు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజ్ హోటల్ పై అటాక్ చేసిన టెర్రరిస్టులని మట్టుబెట్టేందుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ ని ఈ చిత్రంలో చూపించారు. అడివి శేష్ ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించారు. దేశభక్తి అంశాలు, ఎమోషనల్ సీన్స్ ఈ మూవీలో హైలైట్ గా నిలిచాయి.
811
LOC కార్గిల్ (2003):
JP దత్తా రూపొందించిన చిత్రం ఇది. 1999 కార్గిల్ యుద్ధంలో జరిగిన అనేక కీలక సంఘటనలు, సైనికుల పోరాటాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
911
పల్టన్ (2018)
1967 నాథులా, చోలా వద్ద జరిగిన భారత-చైనా ఘర్షణల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, హిమాలయాల్లో సైనికులు చూపిన ధైర్య సాహసాలను ప్రతిబింబించే విధంగా ఉంటుంది.
1011
ఎయిర్‌లిఫ్ట్ (2016)
గల్ఫ్ వార్ సమయంలో కువైట్‌లో ఇరుక్కుపోయిన భారతీయులను రక్షించిన చారిత్రక సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు.
1111
టాంగో చార్లీ (2005)
బాబీ డియోల్, అజయ్ దేవగన్ నటించిన ఈ చిత్రం యుద్ధ సమయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనే అంశాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.