పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌కి చిరంజీవి చురకలు, వాళ్ల ప్రస్తావన తెచ్చి మేనల్లుడిపై సెటైర్లు?

First Published Sep 2, 2024, 9:32 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి స్టార్‌ హీరోలకు, వారి ఫ్యాన్స్ కి చురకలు అంటించారు. పరోక్షంగా ఆయన పవన్‌ కళ్యాణ్‌, మేనల్లుడు అల్లు అర్జున్‌లపై సెటైర్లు పేల్చారు. 
 

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్ వార్‌ చాలా పెరిగింది. ఏ చిన్న పాయింట్ దొరికినా ఒక హీరోపై, మరో హీరో ఫ్యాన్స్ దారుణంగా విమర్శలు చేస్తున్నారు. పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. 

ఈ మధ్య బాగా ఫ్యాన్స్ వార్‌ జరిగింది పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ మధ్యనే అని చెప్పొచ్చు. ఏపీ ఎన్నికలు పెట్టిన చిచ్చు ఇంకా రాజుకుంటూనే ఉంది. జనసేన అధినేత, సొంత మేనమామ పవన్‌ కళ్యాణ్‌ కి కాకుండా ప్రత్యర్థి పార్టీ(వైసీపీ) నాయకుడు శిల్పారవి చంద్ర రెడ్డి గెలుపు కోసం అల్లు అర్జున్‌ స్వయంగా ప్రచారంలో పాల్గొనడం పెద్ద ఇష్యూ అయ్యింది. 
 

ఇది మెగా ఫ్యామిలీలోనూ రచ్చ కి కారణమైంది. మెగా వర్సెస్‌ అల్లు ఫ్యామిలీని అనేలా మారింది. బన్నీ నాన్న అల్లు అరవింద్‌ దీన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసినా అది వర్కౌట్‌ కావడం లేదు. ఇది ఫ్యాన్స్ వార్‌కి కారణమైంది. ఇప్పటికీ ఈ వార్‌ నడుస్తూనే ఉంది. ఏదో రూపంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. 

సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ వార్‌ అనేదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియా నుంచి ఇది పబ్లిక్‌లోకి వెళ్లింది. బయట పరిస్థితులను ప్రభావితం చేసేలా మారింది. వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి వెళ్తుంద. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి దీనిపై స్పందించారు.

Latest Videos


ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన బాలయ్య 50 వసంతాల వేడుకలో పాల్గొన్న చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ రకంగా అందరు హీరోల ఫ్యాన్స్ కి కౌంటర్‌ ఇచ్చాడు. ఫ్యాన్స్ తోపాటు హీరోలకు చురకలు అంటించారు. 

`ఒకప్పుడు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు ఫ్యాన్స్ గొడవలు పడుతుంటే అబ్బా ఫ్యాన్స్ ఇలా ఉన్నారు, ఇలా కొట్టుకుంటున్నారేంటి అనిపించేది. పైన ఉన్న వాళ్లు ఇలానే ఉంటారా? ఇలానే గొడవపడుతుంటారా? అనిపించేంది.

నిజంగా వాళ్ల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో తెలిసేది కాదు, ఎందుకంటే అప్పుడు ఈ మీడియా, సోషల్‌ మీడియా లేదు. అప్పుడు వాళ్లు అందరి ముందుకు వచ్చి మేమంతా బాగానే అన్నదమ్ముల్లాగా ఉన్నామని చెబితే బాగుండనిపించేది. 

దీంతో నేను హీరోగా ఎదిగే రోజుల్లో.. నాతోటి హీరోలతో బ్రదర్‌లాంటి వాతావరణం క్రియేట్‌ చేయాలని చెప్పి, మద్రాస్‌లో ఉన్నప్పుడు పార్టీ కల్చర్‌ని ప్రారంభించాను. పార్టీ అంటే తాగి, ఎంజాయ్‌ చేయడానికి కాదు. అది తమ మధ్య ఎలాంటి అరమరికలు ఉన్నా, పొరమచ్చాలు ఉన్నా అవన్నీ సమసిపోవడానికి, తాము అన్ని మర్చిపోయి తమ మధ్య బాండింగ్‌ పెరగడానికి ఉపయోగపడుతుందని.

ఆ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌, అలాగే, తమిళ, కన్నడ, మలయాళ హీరోలందరు హాజరయ్యేవారు. ఏదో ఒక సందర్భంలో ఏడాదికి ఏడెనిమిదిసార్లు మేమంతా కలుసుకునే వాళ్లం. అలా కలిసినప్పుడు ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. అప్పుడు మేమంతా కలిసి ఇచ్చే ఫోటోలు మా ఫ్యాన్స్ మధ్య సత్సంబంధాలు పెరిగేవి, వాళ్ల మంది స్నేహం పెరిగేది.

మేమంతా కలిసి కట్టుగా ఉంటామనే మెసేజ్‌ వెళ్లేది ఫ్యాన్స్‌ కి. అందుకే  సినిమాల రిలీజ్‌ల టైమ్‌కి వచ్చేటప్పుడు వాళ్ల హీరో బాగుండాలని కోరుకుంటారుగానీ, ఇతర హీరోల సినిమాలనుగానీ, వాళ్లని గానీ విమర్శించరు, ట్రోలింగ్‌ లాంటివి చేసేవాళ్లు కాదు.
 

మేమంతా కలిసి కట్టుగా ఉండటమే దానికి బలమైన కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు మా ఇంట్లో ఏ ఫంక్షన్‌ ఉన్నా, ఫోన్‌ చేసి ఇలా చెప్పగానే, ఏ సోదరా నేను వస్తానని ఉత్సాహంతో చెబుతుంటారు బాలయ్య. అది ఆయన తమపై కురిపించే ప్రేమకి నిదర్శనమని, తమ అనుబంధానికి నిదర్శనమని తెలిపారు

చిరంజీవి. బాలయ్యని ఉద్దేశించి, ఫ్యాన్స్‌ ని ఉద్దేశించి చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హీరోలకు వర్తింప చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఈ మధ్య బాగా గొడవలు జరుగుతున్న పవన్‌, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ కి వర్తింప చేస్తున్నారు.

 చిరంజీవి వ్యాఖ్యలు పరోక్షంగా అల్లుడు బన్నీకి సెటైర్లు లాగా ఉన్నాయని, వీరి మధ్య ఏర్పడిన గ్యాప్‌ని ప్రశ్నించేలా ఉన్నాయని అంటున్నారు. నెట్టింట దీనికి సంబంధించి రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన తొలి బర్త్ డే కావడం విశేషం.

అయితే పవన్‌కి బన్నీ బర్త్ డే విషెస్‌ తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టడం విశేషం. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ పోయినట్టే అని, ఆల్‌ సెట్‌ అని అంటున్నారు నెటిజన్లు. మరి ఫ్యాన్స్ ఇంతటితో ఈ వివాదాన్ని వదిలేస్తారా? కంటిన్యూ చేస్తారా? అనేది చూడాలి.

అయితే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ ఈ గ్యాప్‌ ఉందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. కానీ ఫ్యామిలీ మధ్య వివాదం సెట్ కావడానికి పెద్ద టైమ్‌ పట్టదు. ఏదో రోజు కలిస్తే అన్నీ సర్దుకుంటాయి. వాళ్లని చూసి ఫ్యాన్స్ గొడవలకు దిగడం సరికాదనేద అందరి వాదన. 
 

click me!