
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో నిర్ణయాలు తీసుకునేది పాటించడానికే నచ్చినప్పుడు పాటించి, నచ్చనప్పుడు వదిలేయడానికి కాదు అని శ్రీధర్ తో అంటుంది కాంచన. నేను మిమ్మల్ని పిలిచింది కాశీ, స్వప్నల గురించి మాట్లాడడానికి, వాళ్లను కలిసేలా చేయడానికి అంతే అని చెప్తుంది. స్వప్న నాకు పుట్టకపోయిన నా కూతురు లాంటిదే. మనం మన ప్రయాణంలో పుష్కరాలు చూశాం. కానీ వాళ్లు చిన్న పిల్లలు, ఇంకా ఏం తెలియదు, ఏం చూడలేదు. వాళ్ల ఇద్దరినీ కలపాల్సిన బాధ్యత మనదే అంటుంది కాంచన.
సరే నేను స్వప్నతో మాట్లాడుతాను అంటాడు శ్రీధర్. నేనే మాట్లాడుతాను. కానీ కాశీ ఇక్కడ ఉన్నట్లు స్వప్నకు చెప్పకండని చెప్తుంది కాంచన. దీప నువ్వు త్వరగా వంట చేసి కాశీకి అన్నం పెట్టు, అంతకంటే ముందు స్నానానికి నీళ్లు పెట్టు.. స్నానం చేసి నా బట్టలు వేసుకుంటాడు అని దీపతో చెప్తాడు కార్తీక్. కాశీ, బావ అని ఏదో చెప్పబోతుంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అంటాడు కార్తీక్.
దీపను నువ్వు రక్తం ఇచ్చావా అని అడుగుతుంది కాంచన. షాక్ అవుతారు భార్యాభర్తలు. దీప రక్తం ఇచ్చిన విషయం అమ్మకెలా తెలిసింది అనుకొని అడుగుతాడు కార్తీక్. రక్తం ఇస్తేనే కదా ఇలాంటి బ్యాండేజ్ వేసెది అని దీప చేతికున్న బ్యాండేజ్ చూపిస్తుంది కాంచన. ఈ రోజు రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టుల కోసం బ్లెడ్ తీసుకున్నారు అని కవర్ చేస్తాడు కార్తీక్. డాక్టర్ ఏం చెప్పారు అని అడుగుతుంది కాంచన.
బిడ్డ ఎదుగుదల బాగుందన్నారు అంటాడు కార్తీక్. ఆ మాట విని కాంచన సంతోషిస్తుంది. ఆ తర్వాత వదిన ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది. ట్యాబ్లెట్స్ ఇచ్చారు కదా అవి వేసుకున్నని రోజులు అత్తకు ఏం ప్రమాదం లేదు అంటాడు కార్తీక్. నువ్వు ఇలా చెప్తున్నావు కానీ నా ప్రాణమంతా మా అమ్మ చుట్టూనే తిరుగుతోంది. నా భయమంతా జ్యోత్స్న మీదే ఉంది అని మనసులో అనుకుంటుంది దీప.
మరోవైపు సుమిత్ర గదిలోకి వెళ్తుంది జ్యోత్స్న. నిద్రపోతూ ఉంటుంది సుమిత్ర. నేను ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం నువ్వే మమ్మీ. నీకు బ్లెడ్ క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి నాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తోంది. ఈ ట్యాబ్లెట్ వాడితే నీ ప్రాణాలకు ఏం కాదని డాక్టర్ చెప్పింది. అందుకే నీకు ఈ ట్యాబ్లెట్స్ వేయకుండా వేస్ట్ చేస్తున్నాను అని వాటిని డస్ట్ బిన్ లో పడేస్తుంది జ్యోత్స. దశరథ చూసి ఏం చేస్తున్నావు జ్యోత్స్న అని అడుగుతాడు.
షాక్ అవుతుంది జ్యోత్స్న. ట్యాబ్లెట్స్ డస్ట్ బిన్‌లో ఎందుకు వేశావ్ అని గట్టిగా నిలదీస్తాడు దశరథ. ఇంతలో పారిజాతం, శివన్నారాయణ కూడా వస్తారు. ఏం జరిగిందని అడిగితే దశరథ వారితో జ్యోత్స్న చేసిన పని గురించి చెప్తాడు. రాను రాను దీనికి మతిపోతోంది అని జ్యోను కడిగిపారేస్తుంది పారు. కింద పడిన ట్యాబ్లెట్స్ పని చేస్తాయా? అయినా నేను అన్ని పడేయలేదు కదా.. అని ఒక్క ట్యాబ్లెట్ తీసి చూపిస్తుంది జ్యోత్స్న. నా ముందే అన్ని పడేసింది కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మనసులో అనుకుంటాడు దశరథ.
సుమిత్రను లేపి ట్యాబ్లెట్ వేస్తాడు. నా భార్యను నేను చూసుకుంటాను. లేదా దీప, కార్తీక్ చూసుకుంటారు. నువ్వు ఈ రూమ్ వైపు రావొద్దు. ఏదైనా అవసరం అయితే నేనే పిలుస్తాను అని జ్యోత్స్నతో చెప్తాడు దశరథ. కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఎందుకండి దాన్ని అలా అన్నారు అంటుంది సుమిత్ర. జ్యోత్స్న నీకోసం బాధపడుతోంది. తనని ఎందుకు బాధపెట్టడం అని రావద్దు అని చెప్పాను అంటాడు దశరథ. మంచి పని చేశారు అంటుంది సుమిత్ర.
దశరథ మాటలను గుర్తు చేసుకొని, ఏ ప్లాన్ వర్కౌట్ కావట్లేదు అని చిరాకు పడుతుంది జ్యోత్స్న. ముందు వెళ్లి దాసుతో మాట్లాడాలి. నేను అనుకున్నట్లు జరిగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అని దాసు దగ్గరికి బయల్దేరుతుంది జ్యోత్స్న. గ్రానీకి కూడా చెప్పకుండా వెళ్లాలి అనుకుంటూ నెమ్మదిగా డోర్ తీస్తుంది.
డోర్ తీయగానే పారు, కార్తీక్ ఉంటారు. వారిని చూసి షాక్ అవుతుంది జ్యోత్న్స. ఈ టైమ్‌లో ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది పారు. ఫ్రెండ్ దగ్గరికి అంటుంది జ్యోత్స్న. లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది పారు. గ్రానీ అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. ఈ టైంలో ఫ్రెండ్ దగ్గరికి అంటే ఎవరైనా నమ్ముతారా? అని జ్యోత్స్న చెంపలు వాయిస్తుంది పారు. చచ్చేలా ఉన్నాను గ్రానీ ఆపు అంటుంది జ్యోత్స్న.
ఇంతలో దశరథ, శివన్నారాయణ కూడా వస్తారు. ఈ టైమ్‌లో ఎక్కడికి వెళ్తున్నావు అని ఇద్దరూ అడుగుతారు. అమ్మను కాపాడాలి అనుకుంటే శాంపిల్స్ మ్యాచ్ కాలేదు. రిపోర్ట్స్ తప్పుగా వచ్చాయి. నా మనసు బాగోలేదు. నిద్ర పట్టక బయటకు వెళ్తున్నాను అని చెప్తుంది జ్యోత్స్న. ఇలా చెప్తే ఎవ్వరూ నమ్మరు. పదా లోపలికి వెళ్దాం అని జ్యోత్స్నను లాక్కొని వెళ్తుంది పారిజాతం.
వదులు గ్రానీ. ఏం చేస్తున్నావు. బావతో చేతులు కలిపి నన్నే కొడతావా అంటుంది జ్యోత్స్న. నేను వాడితో కలిసిపోవడం ఏంటి. వాడు చెప్పినట్లు చేస్తే దాసును కనిపెడతానని చెప్పాడు అంటుంది పారు. అందుకోసం నాకే ఎదురుతిరుగుతావా అంటుంది జ్యోత్స్న. దాసు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అని అడుగుతుంది పారు. తెలియదు అంటుంది జ్యోత్స్న.
మరోవైపు కార్తీక్, దశరథ మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న ట్యాబ్లెట్స్ పడేయడం నేను చూశాను. ఇప్పుడేమో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకుంది. అసలు జ్యోత్స్న ఎందుకు భయపడుతుంది. జ్యోత్స్న బ్లెడ్ శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ కాలేదు. దాసు ఏమయ్యాడు, దాసును జ్యోత్స్న ఎందుకు చంపాలి అనుకుంది. దీపపై ఎటాక్ చేయించింది ఎవరు? నా మనసు నిండా ప్రశ్నలే ఉన్నాయి. ఏదో అనుమానంగా ఉందిరా అని కార్తీక్ తో అంటాడు దశరథ. నేను రెండోసారి టెస్ట్‌లు చేయించాలి అనుకుంటున్నాను అని చెప్తాడు.
ముందు నువ్వు ఆ పని చేయి మామయ్య అంటాడు కార్తీక్. నేను ఆల్రెడీ దీప బ్లెడ్ శాంపిల్స్ ఇచ్చాను. అత్త సేఫ్ అని మనసులో అనుకుంటాడు కార్తీక్. అత్తకు ఏం కాదు. నాకు పుట్టబోయే బిడ్డను ఊయలలో వేయాల్సింది మీరే. నువ్వు ధైర్యంగా ఉండు అని దశరథకు చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.