మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపిక అద్భుతంగా ఉంటుంది. అందుకే చిరంజీవి టాలీవుడ్ లో మెగాస్టార్ అయ్యారు. కొన్నిసార్లు చిరంజీవి కూడా కథల ఎంపికలో తడబడుతుంటారు. అయితే ఓ సినిమా విషయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ డైరెక్టర్ చిరంజీవి వద్దకు కథ తీసుకుని వెళ్లారు. ఆ కథని చిరంజీవి విన్నారు.
25
చిరంజీవికి నచ్చని కథ
కానీ చిరంజీవికి కథ నచ్చలేదు. అలాగని కథ బాగాలేదు అని కాదు. తన ఇమేజ్ కి సెట్ కాదేమో అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ కథ కళ్యాణ్ బాబుకి బాగా సెట్ అవుతుంది అని చెప్పారట. ఆ కథే అన్నవరం చిత్రంగా మారింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు భీమనేని శ్రీనివాస రావు. అన్నవరం మూవీ విషయంలో తెర వెనుక జరిగిన ఈ సంగతులని భీమనేని శ్రీనివాస రావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
35
పవన్ చేతుల్లోకి ఆ చిత్రం
చిరంజీవి గారు ఈ కథ తన ఇమేజ్ కి సెట్ కాదు అని, పవన్ కళ్యాణ్ కి అయితే బావుంటుంది అని అన్నారు. దీనితో పవన్ కళ్యాణ్ గారికి కథ వినిపించడం ప్రాజెక్టు ఓకె కావడం జరిగింది. ఇది సిస్టర్ సెంటిమెంట్ కథ. సుస్వాగతం తర్వాత తనకి పవన్ తో ఇది రెండవ చిత్రం అని భీమనేని అన్నారు. ఈ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఆర్టిఫీషియల్ గా ఉండడం పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు.
పవన్ కళ్యాణ్ గారిలో ఎవ్వరికీ లేని క్వాలిటీ ఒకటి ఉంది. ఆయన దేన్నైనా నమ్మి చేస్తే ఆ రిజల్ట్ డబుల్ ఇంపాక్ట్ తో అద్భుతంగా ఉంటుంది. నమ్మకుండా చేస్తే కొలాప్స్ అవుతుంది. అదే ఆయన బలం, బలహీనత కూడా. అన్నవరం మూవీలో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆయనకి నచ్చలేదు. ఆయన పెర్ఫార్మెన్స్ లో అది తెలిసిపోయింది. అందుకే ఆ చిత్రం పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు అని భీమనేని అన్నారు.
55
డైరెక్టర్ సెంటిమెంట్ ఇదే
కానీ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల పరంగా ఆ సినిమా కమర్షియల్ గా సేఫ్ అని భీమనేని శ్రీనివాస్ అన్నారు. తనకు 'సు' అనే సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది అని భీమనేని శ్రీనివాస్ తెలిపారు. శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం ఇలా వరుస విజయాలు దక్కాయి అని తెలిపారు.