జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్లు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. సుడిగాలి సుధీర్ యాంకర్ గా, హీరోగా రాణిస్తున్నాడు. హైపర్ ఆది, గెటప్ శ్రీను కమెడియన్స్ గా రాణిస్తున్నారు. బలగం వేణు క్రేజీ డైరెక్టర్ అయ్యారు. ఇలా చాలా మంది జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొంది ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటి వారిలో చలాకి చంటి ఒకరు.