చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండకి దిమ్మతిరిగిపోయింది.. బ్యాడ్ సెంటిమెంట్ వణికిస్తోందిగా

First Published | Sep 4, 2024, 10:42 AM IST

చిత్ర పరిశ్రమలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. రిలీజ్ డేట్లు, కాంబినేషన్ల విషయంలో సెంటిమెంట్లు ఉంటాయి. నిర్మాతలు, హీరోలు సెంటిమెంట్లు బాగా ఫాలో అవుతారు. 

చిత్ర పరిశ్రమలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. రిలీజ్ డేట్లు, కాంబినేషన్ల విషయంలో సెంటిమెంట్లు ఉంటాయి. నిర్మాతలు, హీరోలు సెంటిమెంట్లు బాగా ఫాలో అవుతారు. హీరోయిన్లు కూడా కెరీర్ లో రాణించేందుకు కొందరు జ్యోతిష్యుల వద్ద పూజలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. ఒక సంఘటన పలుమార్లు జరిగితే అది సెంటిమెంట్ గా మారిపోతుంది. 

ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో ఆగష్టు రూపంలో బ్యాడ్ సెంటిమెంట్ మొదలైంది. ఆగష్టు నెల అంటేనే టాలీవుడ్ వణికిపోతోంది. సరిపోదా శనివారం తప్ప ఆగస్టులో విడుదలైన పెద్ద చిత్రాలు ఏవీ వర్కౌట్ కాలేదు. కోవిడ్ తర్వాత నుంచి ఈ సెంటిమెంట్ మొదలయింది. ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా భారీ డిజాస్టర్లు అవుతున్నాయి. ఒకసారి ఆ వివరాలు చూద్దాం. 


పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. 2022 ఆగష్టు 25న లైగర్ చిత్రాన్ని రిలీజ్ చేశారు. లైగర్ చిత్రం పూరి జగన్నాధ్ తో పాటు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు పీడకల లాగా మారింది. ఆ చిత్రం మిగిల్చిన నష్టాల నుంచి వారు ఇంకా తేరుకోలేదు. లైగర్ నష్టాల వ్యవహారం పూరి జగన్నాథ్, ఛార్మి లకు పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. 

ఆ తర్వాత 2023లో కూడా టాలీవుడ్ కి షాక్ తప్పలేదు. ముఖ్యంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి పెద్ద దెబ్బ తగిలింది. చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం 2023 ఆగష్టు 11న విడుదలయింది. వేదాళం చిత్రాన్ని మెహర్ రమేష్ చిరంజీవితో రీమేక్ చేశారు. ఈ మూవీలో సన్నివేశాలు కొన్ని చిరంజీవిపై ఊహించని కామెంట్లు పడేలా చేశాయి. ఈ మూవీతో చిరంజీవికి చాలా డ్యామేజ్ జరిగింది. అంతకు ముందే అఖిల్ ఏజెంట్ చిత్రంతో ఊహించని నష్టాలు చవిచూసిన నిర్మాత అనిల్ సుంకరని భోళా శంకర్ చిత్రం మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టింది. 

అనిల్ సుంకర కొన్ని ఆస్తులు కూడా అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి. భోళా శంకర్ రిలీజ్ అయిన కొన్ని రోజులకి ఆగష్టు 25న వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున చిత్రం విడుదలై అది కూడా డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. ఇలా ఒకే నెలల్లో చిరు, వరుణ్ తేజ్ లకు షాక్ తప్పలేదు. 

ఇక ఈ ఏడాది గురించి అందరికీ తెలిసిందే. లైగర్ తర్వాత మరోసారి పూరికి మార్చి నెల కలసి రాలేదు. ఇటీవల విడుదలైన డబుల్ ఇస్మార్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. రామ్ పాత్ర తప్ప, కొన్ని పాటలు తప్ప ఇంకేమి వర్కౌట్ కాలేదు. దీనితో సీన్ రిపీట్.. పూరి, రామ్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. డబుల్ ఇస్మార్ట్ తో పాటు ఆగష్టు 15న రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రం కూడా విడుదలైంది. మినిమమ్ గ్యారెంటీ హిట్ అనుకున్న ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి రిలీజ్ కి ముందు మంచి బజ్ ఏర్పడింది. కానీ అది వర్కౌట్ కాలేదు. గ్లామర్ తో సందడి చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి కూడా షాక్ తప్పలేదు. ఆ విధంగా ఆగష్టు నెల టాలీవుడ్ కి బ్యాడ్ సెంటిమెంట్ గా మారుతోంది.  

Latest Videos

click me!