Nivin Pauly
గత కొద్ది రోజులుగా హేమ కమిటీ.. మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసేస్తోంది. చాలా మంది హీరోలును, దర్శకులను ఇరుకున పడేసింది. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నటులుపై లైంగిక ఆరోపణలు రావడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయమై నటీనటుల సంఘం అధ్యక్షుడు మోహన్ లాల్‌తో పాటు మిగతా సభ్యులు రాజీనామా చేసారు.
ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయకండని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు 'ప్రేమమ్' సినిమాతో తెలుగు వాళ్ళకు కూడా పరిచయం అయిన హీరో నివీన్ పౌలీపై ఓ నటి పోలీస్ కేసు పెట్టింది.
Nivin Pauly suspects a conspiracy behind the rape complaint against him
ఆ కేసులో ఏముంది అంటే...సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి గతేడాది నవంబరులో దుబాయి తీసుకెళ్లారట. అక్కడే లైంగికంగా వేధించారని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. హీరో నివిన్ పౌలీ సహా ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నారు. ఈ లిస్ట్ లో నివిన్ ఆరో వ్యక్తి.
Actor Nivin Pauly
నివిన్‌పై కేసు నమోదైన విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు, ఇతర భాషల ప్రేక్షకులకూ నివిన్ సుపరిచితుడు కావటం చెప్పుకోదగ్గ విషయం. ‘ప్రేమమ్’ (Premam) చిత్రానికి ముందు చాలా సినిమాలు చేసినా ఆ సినిమాతోనే ఒక్కసారిగా దేశం మొత్తం తెలిసాడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు అతడు దగ్గరయ్యాడు.
nivin pauly
నినిన్ పౌలి ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటాడు నివిన్. ఈ ఏడాది ‘మలయాళీ ఫ్రమ్ ఇండియా’తో ప్రేక్షకులను పలకరించాడు. ‘ఏళు కడల్ ఏళు మలై’ అనే తమిళ చిత్రంలోనూ నటించారు. ఈ రెండు సినిమాలు బాగానే వర్కవుట్ అయ్యాయి.
ఇక ఈ కేసు విషయమై2 స్వయంగా నివిన్ స్పందించాడు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని ఖండిచారు. 'ఓ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టాననే వార్తలు విన్నాను. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. నాపై వచ్చిన నిరాధార ఆరోపణల్ని ఖండిస్తున్నాను. అవన్నీ నిజం కాదు. ఈ విషయమై నేను న్యాయంగా పోరాడుతా' అని ఇన్ స్టాలో నివిన్ పౌలీ పోస్ట్ పెట్టారు.
actor Nivin pauly
మరో ప్రక్క ఇప్పటికే నటులు సిద్ధిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్‌లపై కేసులు నమోదయ్యాయి. కేరళ ప్రభుత్వం కూడా ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసింది.షూటింగ్ ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కలిగించేందుకు నివేదికలో చేసిన సూచనలను స్వాగతిస్తునని చెప్పిన మమ్ముట్టి, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు.