దూకుడు, ఆగడు, వెంకీ అన్నీ మిక్స్ అయితే ఎలా ఉంటుంది.. ఇకపై డ్యామేజ్ జరిగితే కష్టం అంటూ

ఒకప్పుడు శ్రీను వైట్ల అంటే కామెడీ ప్లస్ యాక్షన్ చిత్రాలకు ఒక బ్రాండ్. కామెడీ సన్నివేశాలతో పొట్ట చెక్కలు చేస్తూనే మాస్ ప్రేక్షకులకు అవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ తో అద్భుతంగా సినిమాని తెరకెక్కించడం శ్రీనువైట్ల స్టైల్. 

ఒకప్పుడు శ్రీను వైట్ల అంటే కామెడీ ప్లస్ యాక్షన్ చిత్రాలకు ఒక బ్రాండ్. కామెడీ సన్నివేశాలతో పొట్ట చెక్కలు చేస్తూనే మాస్ ప్రేక్షకులకు అవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ తో అద్భుతంగా సినిమాని తెరకెక్కించడం శ్రీనువైట్ల స్టైల్. కానీ వైట్ల రిపీట్ గా అదే తరహా చిత్రాలు చేయడంతో ఒక టైంలో అది అవుట్ డేటెడ్ గా మారిపోయింది. 

ఆగడు చిత్రంతోనే శ్రీను వైట్లకి డేంజర్ బెల్స్ మొదలయ్యాయి. కానీ ఈ సీనియర్ డైరెక్టర్ గమనించలేదు. ఆ తర్వాత బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని లాంటి డిజాస్టర్స్ ఎదురయ్యాయి. ఈ చిత్రాలతో శ్రీనువైట్ల కెరీర్ డేంజర్ లో పడే పరిస్థితి ఏర్పడింది. 


స్టార్ హీరోలంతా శ్రీను వైట్లకి ముఖం చాటేశారు. రవితేజ, మహేష్ బాబు ఎన్టీఆర్ లకు వైట్ల సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చారు. శ్రీనువైట్ల నుంచి చిత్రం వచ్చి ఆరేళ్ళు అవుతోంది. చివరగా వైట్ల తెరకెక్కించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని 2018లో విడుదలయింది. గ్యాప్ తీసుకుని శ్రీను వైట్ల ప్రస్తుతం గోపీచంద్ తో విశ్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ అవుతోంది. దీనితో రీసెంట్ గా టీజర్ విడుదల చేశారు. 

టీజర్ శ్రీనువైట్ల స్టైల్ లో కామెడీ, యాక్షన్ మిక్స్ ఉండడంతో ఆకట్టుకుంటోంది. అయితే కొంతమంది నెటిజన్లు టీజర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. విశ్వం టీజర్ లో వెంకీ, దూకుడు, ఆగడు చిత్రాల ఛాయలు కనిపిస్తున్నాయి. వెంకీ చిత్రంలో ట్రైన్ ఎపిసోడ్ ని ఆడియన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. ఆ సన్నివేశం స్ఫూర్తితోనే ఈ మూవీలో కూడా ట్రైన్ సీన్ పెట్టినట్లు ఉన్నారు. 

ఈ సీన్ లో బీస్ట్, జైలర్, భగవంత్ కేసరి చిత్రాలతో సౌత్ మొత్తం పాపులర్ అయిన కమెడియన్ వీటివి గణేష్ విశ్వం చిత్రంలో ఉన్నారు. ట్రైన్ ఎపిసోడ్ లో ఆయన టీసీగా కనిపిస్తున్నారు. అదే విధంగా వెన్నెల కిషోర్ ఉన్నారు. మరి ఈ సన్నివేశం వెంకీ చిత్రాన్ని మించేలా ఉంటుందో లేదో చూడాలి. అదే విధంగా ఆగడు, దూకుడు చిత్రాలని పోలిన సన్నివేశాలు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. 

శ్రీనువైట్ల వెంకీ, దూకుడు, ఆగడు చిత్రాలని మిక్స్ చేస్తే చేశారు కానీ.. గోపీచంద్ కి హిట్ ఇస్తే చాలు అని అంటున్నారు. గోపీచంద్ కి కూడా విశ్వం చిత్రం హిట్ కావడం తప్పనిసరి. ఇటీవల గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్, రామబాణం, భీమా చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. తన చిత్రాలన్నింటిని మిక్స్ చేస్తున్న శ్రీను వైట్ల గోపీచంద్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో అని అంతా ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!