పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `ఓజీ` మూవీ ఈ నెల 25న విడుదలైన విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. మంచి ఆదరణ పొందుతోంది. బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోన్న ఈ సినిమాని మెగా ఫ్యామిలీ హీరోలు ప్రత్యేకంగా వీక్షించారు. ఇందులో హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తోపాటు చిరంజీవి, రామ్ చరణ్, సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్, కూతురు ఆధ్య వీక్షించిన వారిలో ఉన్నారు. వీరితోపాటు చిత్ర దర్శకుడు సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కెమెరామెన్ రవి కె చంద్రన్, నిర్మాత దానయ్య, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ వంటి వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ దగ్గరుండి సినిమాని చూపించడం విశేషం.