చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రానా.. పేర్లు మార్చుకున్న స్టార్ హీరోలు వీరే? రియల్ నేమ్స్ ఏంటో తెలుసా?

Published : Mar 24, 2024, 03:57 PM IST

టాలీవుడ్, కోలీవుడ్ లో అగ్రస్థాయి హీరోలుగా ఉన్న మన స్టార్స్ అసలు పేర్లు చాలా మందికి తెలిసి ఉండదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ముందు వీరి రియల్ నేమ్స్ ఏంటో తెలుసుకుందాం.

PREV
18
చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రానా.. పేర్లు మార్చుకున్న స్టార్ హీరోలు వీరే? రియల్ నేమ్స్ ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ‘స్వయంకృషి’తో ఇండస్ట్రీలో తన ముద్రవేయడం ప్రారంభించిన మెగాస్టార్ స్కీన్ నేమ్ ను ‘చిరంజీవి’ అని పెట్టుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

28

చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు కావడం విశేషం.

38

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న హీరోగా నిలిచారు. మన డార్లింగ్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు.

48

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో దగ్గుబాటి రానా (Daggubati Rana) అసలు పేరు కూడా చాలా మందికి తెలిసి ఉండదు. తన తాత రామానాయుడు పేరునే పెట్టుకున్నారు. స్కీన్ నేమ్ కోసమని రానాగా మార్చుకున్నారు.

58

ఇక కోలీవుడ్ విషయానికొస్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)  కూడా పేరు మార్చుకున్నారనే విషయం తెలిసిందే. ఇక ఆయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్.

68

లోకనాయకుడు, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan)  కూడా సినిమాల కోసం పేరు మార్చుకున్నారు. ఆయన రియల్ నేమ్ పార్థసారథి శ్రీనివాసన్.

78

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కు తెలుగులో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇక ఆయన అసలు పేరు శివకుమార్ శరవణన్ కావడం విశేషం. సూర్య నుంచి నెక్ట్స్ ‘కంగువా’ చిత్రం రాబోతోంది.

88

ఇక తమిళ స్టార్, రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ (Dhanush) కూడా సినిమాల కోసం పేరు మార్చుకున్నారు. ఆయన అసలు పేరు వెంకటేష్ ప్రభు.

Read more Photos on
click me!

Recommended Stories