వేశ్య అంటూ తిడుతున్నారు.. హీరోయిన్ అదా శర్మ ఆవేదన..

First Published Mar 24, 2024, 3:29 PM IST

తనను దారుణంగా ట్రోల్స్ చేసిన వారిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ అదాశర్మ. తనను విమర్షించిన వారికి గట్టిగా సమాధానం చెప్పింది బ్యూటీ.  
 

బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసినా... హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు నిజంగానే హార్ట్ ఎటాక్ అయ్యేలా చేసింది బాలీవుడ్ బ్యూటీ అదాశర్మ. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసినా ఆమెకు స్టార్ డమ్ రాలేదు. అంతే కాదు ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలే వరించాయి టాలీవుడ్ లో. ముఖ్యంగా ఆమె..  సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్ష‌ణం లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. 

 ప్రతీ ఫోటో షూట్ ఒక ప్రపంచ వింతలా చేస్తుంది అదా శర్మ. అందుకే ఆమె వెండితెరపై సక్సెస్ అవ్వకపోయినా. . అదా సౌందర్యానకి.. సోషల్ మీడియా దాసోహం అయ్యింది. నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె ఎప్పుడెప్పుడు ఫోటోలు పెడుతందా.. అని రొమాంటిక్ ఫాలోవర్స్ ఎదరు చూస్తూ ఉంటారు. 

ఎంత ఫాలోయింగ్ ఉన్నా.. ఎంత పెద్ద స్టార్ అయినా.. కొన్నిసార్లు ట్రోలింగ్, అవమానాలు తప్పవు. ముఖ్యంగా హీరోయిన్స్ మీద దారుణగా ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా ఆదాశర్మకు కూడా అది తప్పలేదు. ట్రోలింగ్ అంటే మామూలుగా కాదు.. అవమానకరంగా నోటికొచ్చినట్టు తిట్టడం ఆదాశర్మను ఎంతో బాధపెట్టిందట. ఇంతకీ నెటిజన్లు ఆమెను ఏమన్నారంటే..? 

Photo Courtesy: Instagram

తనపై జరిగిన ట్రోలింగ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది అదాశర్మ. కొందరైతే తనని వేశ్య అని తిడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. విషయం ఏంటంటే.. అదా శర్మ ఇటీవల బస్తర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పోస్టర్ వచ్చినప్పటి నుంచి ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.

adah Sharma

బస్తర్ సినిమా పోస్టర్ లో రగ్డ్ లుక్ లో చేతిలో గన్ పట్టుకుని అదా శర్మ ఉంది. అంత అద్భుతమైన పాత్ర చేయడం సాహసమే అనుకోవాలి. అలాంటిసాహసం చేసినందుకు ఆమె విమర్శలు ఫేస్ చేసింది. ఈ సినిమాలో అదాశర్మ ఐపీఎస్ అధికారిగా నటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ ముందు వరకు అదా శర్మని ట్రోల్ చేశారు. అసలు సినిమా ఏంటో కూడా తెలియకుండా తిట్టారంటూ ఆమె వాపోయింది.
 

adah sharma

 అయితే ఆడియన్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. ఎలాగైతే ఆడియన్స్, నెటిజన్స్ వారికి ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారో.. నటులకు కూడా తమకు ఇష్టమొచ్చిన సినిమాలు చేసుకునే హక్కు ఉంది అంటూ అదా శర్మ కౌంటర్ ఇచ్చింది. కొందరైతే తాను ఏ పోస్ట్ పెట్టినా.. ఏ ఫొటో పెట్టినా కామెంట్స్ లో ఇష్టమొచ్చినట్లు తిట్టారంటూ బాధ పడింది. కొందరైతే వేశ్య అంటూ కామెంట్స్ పెట్టారంటూ భావోద్వేగానికి లోనైంది. 

ఇలాంటి వివాదాలు అదాశర్మకు కొత్తేం కాదు.. ఈమధ్యే రిలీజ్ అయిన ది కేరళ స్టోరీస్ సినిమాద్వారా కూడా వివాదం అయ్యింది అదాశర్మ. గతంలో కూడా రకరకాల డ్రెస్సింగ్ స్టైల్స్ తో హాట్ టాపిక్ అయ్యింది. హార్ట్ ఎటాక్ సినిమాలో లాంగ్ కిస్ తో బాగా పాపులర్ అయ్యింది అదా.. 

click me!