Chiranjeevi: సందీప్‌ రెడ్డి వంగా ఆఫీస్‌లో ఉన్న చిరంజీవి ఫోటో ఏ సినిమాలోనిదో తెలుసా? ఫోటో వెనుక స్టోరీ!

Published : Feb 05, 2025, 12:24 PM ISTUpdated : Feb 05, 2025, 12:29 PM IST

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి ఓల్డ్ సినిమాకి చెందిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి ఆ సినిమా ఏంటి? సందీప్‌ రెడ్డి ఎందుకు తన ఆఫీస్‌లో పెట్టుకున్నారనేది చూస్తే. .

PREV
16
Chiranjeevi: సందీప్‌ రెడ్డి వంగా ఆఫీస్‌లో ఉన్న చిరంజీవి ఫోటో ఏ సినిమాలోనిదో తెలుసా? ఫోటో వెనుక స్టోరీ!
chiranjeevi

Chiranjeevi: ప్రస్తుతం చిరంజీవి పాత సినిమా ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. అందులో చిరంజీవి యంగ్‌ లుక్‌లో ఉన్నారు. కేవలం పింక్‌ బనియన్‌ ధరించి, వైట్‌ టవల్ మెడకు చుట్టుకుని ఉన్నారు. కోపంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ పోస్టర్‌ ఎందుకు ట్రెండ్‌ అవుతుంది? దానికి కారణం ఏంటనేది చూస్తే. 

26
Chiranjeevi

ఈ చిరంజీవి ఫోటో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఆఫీస్‌లో ఉంది. ఆఫీస్‌లోకి ఎంటర్‌ కాగానే పెద్దగా ఫ్రేమ్‌ కట్టించి గొడకు పెట్టాడు సందీప్‌ రెడ్డి వంగా. ఆయన ఆఫీస్‌లో చిరంజీవి ఫోటో ఉండటమే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. ఇది చిరంజీవిపై ఆయనకున్న అభిమానాన్ని తెలియజేస్తుంది. మెగాస్టార్‌ కి సందీప్‌ ఎంతటి హార్డ్ కోర్‌ ఫ్యానో అర్థమవుతుంది. 
 

36

మరి సందీప్‌ రెడ్డి వంగా పెట్టుకున్న చిరంజీవి లుక్‌ ఏ సినిమాలోనిది, ఎందుకు సందీప్‌ రెడ్డి వంగా తన ఆఫీస్‌లో పెట్టుకున్నాడనేది చూస్తే, ఇది `ఆరాధన` చిత్రంలోని చిరంజీవి లుక్‌. ఇందులో మెగాస్టార్ నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర పోషించారు. ఇందులో సుహాసిని హీరోయిన్‌గా నటించింది.

రాజశేఖర్‌ కీలక పాత్రలో నటించగా, రాధిక మరో ముఖ్య పాత్ర పోషించింది. ఇందులో మెగాస్టార్‌ బజార్‌ రౌడీ. పేరు పులిరాజు.ఆయనపై చాలా కేసులున్నాయి. 18సార్లు జైలుకి కూడా వెళ్లివస్తారు. ఆ ఊర్లో ఆయనంటే హడల్‌. పులిరాజు వస్తున్నాడంటే అంతా పారిపోవాల్సిందే. అంతగా భయపడిపోతుంటారు. 
 

46

అదే ఊర్లో ఓ టీచర్‌ సుహాసిని వస్తుంది. అందరు భయపడినా, ఆమె మాత్రం ధైర్యంగా ఉంటుంది. పులిరాజులోని మంచితనం చూస్తుంది. కసాయి రౌడీ అయినా, మార్చితే మారతాడు అని నమ్ముతుంది. పులిరాజుని మార్చేప్రయత్నం చేస్తుంది. టీచర్‌ మాటలకు పులిరాజులోనూ మార్పు వస్తుంది.

చూడ్డనికి కసాయి వాడుగా ఉన్నా, క్రమంలో ఆయనలోనూ మార్పు వస్తుంది. సుహాసిని పాత్ర పులిరాజు గురించి దేవుడికి మొక్కుకోవడంతో అది చాలు నాకు అంటూ సంతోషిస్తాడు పులిరాజు. ఆ తర్వాత అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి.

వీరిద్దరు కలిశారా? విడిపోయారా? అనేది కథ. భారతీరాజా రూపొందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించింది. ఇళయరాజా సంగీతం అందించారు. 1987లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. కానీ క్రిటిక్స్ ప్రశంసలందుకుంది. 
 

56

ఇందులో చిరంజీవి నెగటివ్‌ షేడ్‌ రోల్ అదిరిపోయేలా ఉంటుంది. మెగాస్టార్‌ కూడా చాలా రెచ్చిపోయి చేశాడు. హీరోగా చేయడానికి కొన్ని బౌండరీలుంటాయి. కానీ విలన్‌గా చేయడానికి ఎలాంటి బౌండరీలుఉండవు. దీంతో విశ్వరూపం చూపించారు. విలనిజంతోపాటు ఫన్‌, ఎమోషన్స్ ని పలికించి ఆకట్టుకున్నారు.

నవ్వించాడు. బయపెట్టించాడు, కన్నీళ్లు పెట్టించాడు చిరంజీవి. సందీప్‌ రెడ్డి వంగాకి ఈ `ఆరాధన` సినిమా అన్నా, చిరంజీవి పాత్ర బాగా నచ్చింది. ఈ మూవీ చూసి మెగాస్టార్‌కి అభిమాని అయిపోయారు. అందుకే ఆ గుర్తుగా ఈ ఫోటోని తన ఆఫీసులో పెట్టుకున్నారట. అంతేకాదు చిరంజీవిని చూసే ఆయన సినిమాల్లోకి వచ్చినట్టు, ఆయనతో సినిమా చేయాలనుకున్నట్టు సమాచారం. 
 

66

సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో `స్పిరిట్‌` సినిమా చేయబోతున్నారు. ఇందులో ప్రభాస్‌ పాత్ర విభిన్న షేడ్స్ ఉంటుందట. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది సందీప్‌. దీంతోపాటు రామ్‌ చరణ్‌తోనూ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. 

read more: #Prabhas: ప్రభాస్ సోషల్ మీడియా సీక్రెట్, లీక్ అయ్యిపోయిందే

also read: ప్రీ సేల్స్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ చిత్రాలు.. విజయ్‌, రజనీ, అజిత్‌ ఎవరు టాప్‌ ?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories