చిరంజీవి భార్యగా,చెల్లిగా నటించిన నయనతార
ఇక చిరంజీవి సరసన చెల్లెలిగా నటించి మరో స్టార్ హీరోయిన్ నయనతార. సైరా సినిమాలో మెగాస్టార్ భార్యగా నటించిన నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించింది. అయితే ఈసినిమాలో చిరంజీవి పాత్రకు సవతి సోదరిగా నయన్ కనిపించింది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో నయనతార చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి సినిమా ప్రస్తావన వచ్చింద కాబట్టి ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఈసినిమాలో చిరంజీవి చెల్లెలుగా మీరా జాస్మిన్ నటిస్తున్నట్టు సమాచారం. మీరా జాస్మిన్ హీరోయిన్ గా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రవితేజ,లాంటి స్టార్స్ సరసన సందడి చేసింది మీరా జాస్మిన్.