చిరంజీవితో నాని మూవీ, పోస్టర్‌తోనే గూస్‌బంమ్స్.. సైకిల్‌ అంటే ఇలానే ఉంటుందేమో, సీనియర్లకి కాలం చెల్లిందా?

First Published | Dec 3, 2024, 11:24 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి తన కొత్త సినిమాని ప్రకటించారు. ఇందులో నాని భాగం కావడం విశేషమైతే, ఈ ప్రాజెక్ట్ అనేక ఆలోచనలకు రేకెత్తిస్తుంది. కొత్త పంథాని తెలియజేస్తుంది. 
 

మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమాని ప్రకటించారు. అనూహ్యంగా ఆయన ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతుండటం విశేషం. ఇప్పుడు బిగ్‌ స్టార్స్ సైతం యంగ్‌ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ కొత్త కథలను ఆడియెన్స్ కి చెప్పబోతున్నారు. కొత్త పంథాని ఫాలో అవుతున్నారు. తాజాగా చిరంజీవి సినిమా ప్రకటనే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. చిరంజీవి.. `దసరా` ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఇందులో విశేషమేంటంటే ఈ మూవీకి నాని సమర్పకులుగా నిలవడం విశేషం. ఆయన కొత్త ప్రొడక్షన్‌ స్టార్ట్ చేశారు. యునానమస్‌ ప్రొడక్షన్‌ పతాకంపై ఆయన ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది మెగాస్టార్‌ చేస్తున్న మోస్ట్ వాయిలెంట్‌ ఫిల్మ్ అని తెలిపింది టీమ్‌. ప్రస్తుతం నానితో ఓ మూవీ చేస్తున్నాడు శ్రీకాంత్‌. అనంతరం ఈ చిరంజీవి సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. 

Latest Videos


ఇక ఈ సందర్భంగా చిరు మూవీని ప్రకటిస్తూ పవర్‌ఫుల్‌ పోస్టర్ ని విడుదల చేసింది టీమ్‌. ఇందులో చిరంజీవి చేతి నుంచి రక్తం కారుతుండగా. `హింసలోనే అతను శాంతిని వెతుక్కుంటాడు` అని తెలిపారు. ఈ ట్యాగ్‌ లైనే గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. ఈ మూవీని ప్రకటిస్తూ నాని ట్వీట్‌ చేశారు. `ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ ఎదిగాను.

ఆయన సినిమాల కోసం గంటల తరబడి క్యూ లైన్‌లో వెయిట్‌ చేశాను. ఆఖరికి నా సైకిల్‌ని కూడా పోగొట్టుకున్నా. ఆయన మాకొక వేడుక. ఇప్పుడు ఆయన్నే మీ ముందుకు తీసుకొస్తున్నా, భూమి గుండ్రంగా ఉంటుందంటే ఇదేనేమో(సైకిల్‌). మెగాస్టార్‌ చిరంజీవిని మరింత కొత్తగా చూపించడానికి మేమెంతో వేచి చూస్తున్నాం. నా దర్శకుడు శ్రీకాంత్‌ ఓడెలతో ఆ కల సాకారం కాబోతుంది` అని నాని వెల్లడించారు. 
 

నాని చెప్పినట్టుగానే  ఇదంతా ఓ సైకిల్‌ మాదిరిగా జరుగుతుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సీనియర్‌ హీరోలంతా ఇప్పుడు యంగ్‌ డైరెక్టర్స్ బాట పట్టారు. కొత్త కథలను చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. కొత్త పంథాని ఫాలో అవుతున్నారు. ఇది సీనియర్ల(డైరెక్టర్ల) పని అయిపోయిందా? అనే భావన కలిగిస్తుంది.

ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్‌ దర్శకులు ఉన్నారు. మెగాస్టార్‌తో సినిమాలు చేయడానికి వాళ్లంతా రెడీగా ఉన్నారు. కానీ వాళ్లని కాదని చిరు ఒక్క సినిమా దర్శకుడితో సినిమా చేయడమే ఆశ్చర్యంగా మారింది. ఈ లెక్కన ఇది సీనియర్లకి కాలం చెల్లిందా అనే సాంకేతాలను పంపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

ఇక చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. ఈ దర్శకుడు కూడా ఒక్క మూవీ డైరెక్టర్‌. వశిష్ట చివరగా `బింబిసార` మూవీతో ఆకట్టుకున్నాడు. తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు రెండో సినిమానే చిరంజీవితో చేయడం విశేషం. ఇందులో త్రిష హీరోయిన్‌. సురభి, ఈషా చావ్లా ఇతర పాత్రల్లో మెరవబోతున్నారు. యూవీక్రియేషన్స్ దీన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

read more:సిల్క్ స్మిత హీరోయిన్‌గానే కాదు, ఆమెలో ఉన్న ఈ టాలెంట్‌ గురించి తెలుసా ?

also read: రోజాకి చుక్కలు చూపించిన బాలకృష్ణ.. సెట్‌కి రోజూ ముందుగా రమ్మన్నది ఎందుకో తెలుసా?

click me!