జూనియర్ ఎన్టీఆర్ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్, తారక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్..

First Published | Dec 3, 2024, 8:35 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఓ అద్భుతమైన వార్త త్వరలో వినబోతున్నారట ఫ్యాన్స్. ఈ న్యూస్ వినగానే తారక్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవడం ఖాయం అంటున్నారు. ఇంతకీ ఏంటా వార్త. 

ప్రస్తుతం దేవర సక్సెస్ జోష్ ను ఎంజాయ్ చేస్తూనే.. నెక్ట్స్ సినిమాలకోసం పక్కా ప్లాన్ ను రెడీ చేసుకుంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రిలాక్స్ గా ఉన్నట్టే ఉంటాడు తారక్.. కాని సినిమాల విషయంలో మాత్రం పక్కాగా ప్లాన్ లో ఉంటాడు. ఈక్రమంలోనే దేవర తరువాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ లో కలిసి చేస్తోన్న భారీ మల్టీ స్టారర్ వార్ 2 ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. 

ఈసినిమా కంప్లీట్ చేసిన తరువాత ఎన్టీఆర్ ఏ సినిమా స్టార్ట్ చేస్తాడు అనేవిషయంలో నిజంగానే కన్ ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే.. అటు దేవర 2, ఇటు చాలా కాలంగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మూలన ఉంది. మరో వైపు మరో రెండు సినిమాలు వెయిటింగ్ ఇప్పుడు ఆయన ఏ ఆప్షన్ తీసుకుంటాడు అనేది చూడాలి. అయితే తాజా సమాచారం ప్రకారం వార్ 2 షూటింగ కంప్లీట్ అయిన వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కు కొబ్బరికాయ కొట్టాలని అనుకుంటున్నాడట యంగ్ టైగర్. 

Latest Videos


అందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారట. అంతే కాదు ఇప్పటికే ఈసినిమాకు సబంధించిన ఓ లుక్ కూడా  రిలీజ్అయ్యింది. ఇక సినిమా స్టార్ట్ కావడంతోనే టైటిల్ ను కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈసినిమాకు డ్రాగన్ టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్టే అంటున్నారు. డ్రాగన్ ఫైర్ ను ఎన్టీఆర్ లో చూపించేలా క్యారెక్టర్ ను రాసుకున్నాడట ప్రశాంత్ నీల్. ఈసినిమాలో తారక్ పాత్ర నెగెటీవ్ గా ఉంటుందట. 

Jr NTR , Marvel Cinematic Universe, Iron man

దాంతో ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీని ఇంకాస్త పెంచాడు దర్శకుడు. కాగా ఎన్టీఆర్ ఇప్పటి వరకూ రెండు సార్లు నెగెటీవ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలు చేవాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ లో ఆయన అలా కనిపించగా.. ఆతరువాత జైలవకుష సినిమాలో కూడా ట్రిబుల్ రోల్ చేసిన తారక్.. అందులో ఒకటి నెగెటీవ్ రోల్ చేశారు. ఇక ప్రశాంత్ నీల్ అంతకు మించిన పాత్రను తారక్ కోసం డిజైన్  చేసి పెట్టాడట. 
 

NTR

కాగా ఈ సినిమా టైటిల్ ను  సంక్రాంతికి అఫీషియల్‌గా ప్రకటించడానికి రెడీ అవుతున్నారు  మేకర్స్ తెలిపారు. అంటే సంక్రాంతికి ఎన్టీఆర్ – నీల్ సినిమా టైటిల్ ఏంటి అన్న దానిపై ఫుల్ గా క్లారిటీ వ‌చ్చేస్తుంది. అంతే కాదు షూటింగ్ కూడా సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేవిధంగా ప్లాన్ చేస్తున్నారట. 
 

Ntr, V.V Vinayak, Aadi

ఇప్పటికే ఈ సినిమాకు సబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. పేపవర్ వర్క్ అంతా ఫినిష్ అయ్యింది కాబట్టి.. షూటింగ్ కు ఎప్పుడైనా సై అంటున్నాడు ప్రశాంత్ నీల్. మరి ఈమూవీ గురించి నెక్ట్స్ అప్ డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. 

click me!