Chiranjeevi: రజనీకాంత్‌, మోహన్‌ బాబు కుట్ర.. చిరంజీవికి ఇండస్ట్రీ హిట్‌ మిస్‌, కానీ మంచే జరిగిందా?

Published : Feb 19, 2026, 09:16 AM IST

చిరంజీవి కెరీర్‌లో అనేక ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఓ దశలో ఏడాదికో ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చారు. కానీ ఆయన రజనీకాంత్‌, మోహన్‌ బాబుల వల్ల మరో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకున్నారు. 

PREV
15
రజనీకాంత్‌, మోహన్‌ బాబు, చిరంజీవి స్నేహం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, చిరంజీవి మధ్య మంచి స్నేహం ఉంది. అది ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకునే స్థాయిలో ఉంది. రజనీకాంత్‌ కోలీవుడ్‌ బిగ్‌ స్టార్‌ అయితే, చిరంజీవి టాలీవుడ్‌ లో బిగ్‌ స్టార్‌. ఈ ఇద్దరు ప్రారంభంలో కలిసి నటించారు కూడా, స్టార్‌ ఇమేజ్‌ వచ్చాక ఆ ప్రయత్నాలు చేయలేదు. అదే సమయంలో మోహన్‌ బాబు, రజనీకాంత్‌ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. ఇప్పటికీ ఈ స్నేహం కొనసాగుతుంది. మోహన్‌ బాబు కోసం రజనీ ఏమైనా చేసేంత ఫ్రెండ్‌షిప్‌ ఉండటం విశేషం.

25
మోహన్‌ బాబు, రజనీ కలిసి చిరుకి దెబ్బ

కానీ మోహన్‌ బాబు, చిరంజీవి మధ్య తరచూ విభేదాలు కనిపిస్తుంటాయి. ఇద్దరు కొన్ని సార్లు కలిసిపోతారు, మరికొన్ని సార్లు నువ్వా నేనా అనేలా ఉంటారు. విమర్శలు చేసుకుంటారు. మళ్లీ ఏదో సందర్భంలో కలిసిపోతారు. ఇవన్నీ తరచూ జరుగుతూనే ఉంటుంది. వీరిపై అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే మోహన్‌ బాబు, రజనీకాంత్‌ కలిసి చిరంజీవి విషయంలో కుట్ర చేశారట. ఆయనకు ఇండస్ట్రీ హిట్‌ రాకుండా చేశారట. మరి ఆ కథేంటో చూస్తే.

35
పెదరాయుడుతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న మోహన్‌ బాబు

మోహన్‌ బాబు కెరీర్‌లో `పెదరాయుడు` మూవీ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌ స్పెషల్‌ రోల్‌ చేశారు. పాపారాయుడిగా నటించారు. మోహన్‌ బాబు ద్విపాత్రాభినయం చేశారు. భానుప్రియ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మోహన్‌ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిపింది. ఆయన్ని తిరుగులేని స్టార్‌ని చేసింది. ఇది తమిళంలో వచ్చిన `నట్టమై` అనే చిత్రానికి రీమేక్‌. అక్కడ శరత్‌ కుమార్, విజయ్‌ కుమార్‌ నటించారు. కేఎస్‌ రవికుమార్‌ దర్శకుడు.

45
పెదరాయుడు చిరంజీవి రాకుండా చేసిన రజనీకాంత్‌

ఈ సినిమాని చూసిన చిరంజీవి తెలుగులో రీమేక్‌ చేయాలనుకున్నారు. రీమేక్‌ రైట్స్ కోసం కేఎస్‌ రవికుమార్‌ని, నిర్మాతలను అప్రోచ్‌ అయ్యారు. కానీ ఈ రైట్స్ మాత్రం మోహన్‌ బాబుకే ఇచ్చారు. కారణం రజనీకాంత్‌. అప్పటికే రజనీ, మోహన్‌ బాబు మంచి ఫ్రెండ్స్. ఆ స్నేహంతోనే `నట్టమై` మూవీ రీమేక్‌ రైట్స్ ని మోహన్‌ బాబుకి ఇప్పించారు. కారణం ఇందులో పాపారాయుడు పాత్రని తాను పోషించడానికి. చిరంజీవికి ఈ రైట్స్ వెళితే ఆ పాత్ర తనకు దక్కుతుందో లేదో అని రజనీ భావించి తన స్నేహితుడికి ఈ రీమేక్‌ రైట్స్ ఇప్పించి ఉండొచ్చు అని టాక్‌. ఏదేమైనా రజనీ, మోహన్‌ బాబుల కారణంగా చిరంజీవికి ఇండస్ట్రీ హిట్‌ మిస్‌ అయ్యిందని చెప్పొచ్చు.

55
`పెదరాయుడు` మిస్‌ కావడమే మంచిదా?

ఇదిలా ఉంటే ఈ విషయంలో మరో వెర్షన్‌ ఏంటంటే.. చిరంజీవి.. ఈ రీమేక్‌ రైట్స్ కోసం అప్రోచ్‌ కావడానికి ముందే రజనీ.. మోహన్‌ బాబుకి ఈ రైట్స్ ఇప్పించారని సమాచారం. మొత్తంగా చిరంజీవి పెద్ద హిట్‌ని కోల్పోయారని చెప్పొచ్చు. అయితే ఒకవేళ చిరంజీవి ఈ సినిమా చేసినా వర్కౌట్‌ కాదని, సినిమా ఆడేది కాదనే టాక్‌ కూడా ఉంది. తనకి ఈ సబ్జెక్ట్ సెట్‌ కాదనే వాదన కూడా ఉంది. ఇప్పుడు చూస్తే అదే అనిపిస్తుంది. `పెదరాయుడు` మిస్‌ అయినా `స్నేహంకోసం` రీమేక్‌ రైట్స్ అడిగారట చిరు. కేఎస్ రవికుమార్‌ కాదనకుండా ఇప్పించారు. కానీ ఈ మూవీ డిజప్పాయింట్‌ చేసింది. బిగ్గెస్ట్ స్టార్‌ అయిన చిరంజీవి పనోడి పాత్రలో కనిపించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే అంతగా ఆసక్తి చూపించలేదు. ఈ విషయాన్ని చిరంజీవినే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories