Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?

Published : Sep 17, 2026, 07:51 PM IST

Chiranjeevi Kaaka Movie: చిరంజీవి ‘కాకా’ సినిమాలో సీనియర్ నటి స్నేహ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి విడుదలపై నిర్మాతలు స్పష్టత ఇచ్చారు.

PREV
15
‘కాకా’లో స్నేహ ఎంట్రీ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాపై రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా సీనియర్ నటి స్నేహ ఈ చిత్రంలో భాగమయ్యారనే ప్రచారం మొదలైంది. సినిమాలో ఆమె చిరంజీవి పాత్రకు భార్యగా కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

25
చిరంజీవితో నటించాలనే కోరిక

చిరంజీవితో కలిసి నటించాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని స్నేహ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు ‘కాకా’ ద్వారా ఆమెకు ఆ అవకాశం దక్కిందనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలి కాలంలో స్నేహ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌తో కలిసి నటించడం ఆమెకు ప్రత్యేకమైన అవకాశంగా మారింది. స్నేహ కెరీర్ ప్రారంభించి 25 ఏళ్ళు పూర్తయింది. చిరంజీవితో నటించాలనే ఆమె చిరకాల కోరిక పాతికేళ్ళకు నెరవేరుతోంది.

35
కె. సత్యంగా మెగాస్టార్

‘కాకా’లో చిరంజీవి కె. సత్యం అనే పాత్రలో కనిపించనున్నారు. ఆక్వా పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేసే సాధారణ వ్యక్తిగా ఆయన పాత్ర పరిచయం కానుంది. అయితే అతని సాధారణ జీవితం వెనుక ఒక బలమైన కథ దాగి ఉన్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఈ పాత్ర చిరంజీవి గత చిత్రాలకు భిన్నంగా ఉండనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

45
అనస్వర రాజన్ పాత్ర కీలకం

మలయాళ నటి అనస్వర రాజన్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఆమె ‘అమ్ములు పాప’ అనే పాత్రను పోషిస్తున్నారు. కథలో ఈ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని చిత్ర బృందం వెల్లడించింది. దీంతో చిరంజీవి పాత్రతో పాటు అనస్వర రాజన్ పాత్ర చుట్టూ కూడా కథనం ఎలా సాగుతుందనే ఆసక్తి నెలకొంది.

55
సంక్రాంతి విడుదలపై క్లారిటీ

'కాకా’ సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ కూడా సంక్రాంతికి రాబోతోందనే ప్రచారం మొదలైంది. ఒకవేళ ‘విశ్వంభర’ సంక్రాంతి బరిలోకి వస్తే ‘కాకా’ను వేసవికి వాయిదా వేస్తారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ ‘కాకా’ నిర్మాతలు తాజాగా తమ సినిమా సంక్రాంతికే వస్తుందని స్పష్టం చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories