Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా

Published : Sep 17, 2026, 06:02 PM IST

అనసూయ భరద్వాజ్ కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరలో గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. ఈసారి షార్ట్ హెయిర్ తో కనిపించి మరింత సర్ప్రైజ్ చేసింది.

PREV
18
చీరలో అనసూయ గ్లామరస్ లుక్

అనసూయ భరద్వాజ్ కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకుపచ్చని ప్రకృతి మధ్య గోల్డ్ బ్రౌన్ రంగు చీరలో కనిపించిన ఆమె గ్లామరస్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

28
చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు

సింపుల్ డిజైన్ ఉన్న చీరకు మ్యాచింగ్ బ్లౌజ్, చెవికి జుంకాలు ధరించిన అనసూయ స్టైలిష్‌గా కనిపించారు. సహజమైన బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన ఈ ఫొటోల్లో ఆమె పోజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

38
యాంకర్ నుంచి నటిగా

టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత వెండితెరపైకి అడుగుపెట్టారు. క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా, రంగస్థలం వంటి సినిమాల్లోని పాత్రలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

48
రంగమ్మత్తగా ప్రత్యేక గుర్తింపు

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌లో కీలకంగా నిలిచింది. ఆ తర్వాత పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో దాక్షాయణి పాత్రతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆమె చేసిన పాత్రలు వైవిధ్యంగా ఉండటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా అవకాశాలు కొనసాగుతున్నాయి.

58
వరుస సినిమాలతో బిజీగా

ఇటీవలి కాలంలో అనసూయ పలు సినిమాల్లో కనిపించారు. సింబా, రజాకార్, పుష్ప 2, హరి హర వీరమల్లు, అరి వంటి చిత్రాల్లో నటించిన ఆమె, 2026లో నాగబంధం సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించారు.

68
రాబోయే సినిమాలపై ఆసక్తి

ప్రస్తుతం అనసూయ నటిస్తున్న చిత్రాల జాబితాలో తమిళ చిత్రం వుల్ఫ్‌తో పాటు ఫ్లాష్‌బ్యాక్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.

78
వివాదాలతోనూ వార్తల్లో

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్ల అనసూయ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. 2026లో పాత జబర్దస్త్ వీడియోపై చర్చ జరగగా, రాశికి సంబంధించిన పాత స్కిట్ విషయంలో అనసూయ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు.

88
కొత్త ఫొటోలతో మళ్లీ ట్రెండింగ్

ఇలా సినిమాలు, సోషల్ మీడియా పోస్టులతో ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండే అనసూయ, తాజాగా చీరలో షేర్ చేసిన ఈ ఫొటోలతో మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. గోల్డ్ బ్రౌన్ చీరలో ఆమె గ్లామరస్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories