రాజమౌళి ఇతర రైటర్ల కథలతో సినిమాలు ఎందుకు చేయడో తెలుసా? అంత పెద్ద చేదు అనుభవం ఉందా?

Published : Jul 17, 2024, 09:08 PM IST

దర్శకుడు రాజమౌళి ఇప్పటి వరకు తన తండ్రి విజయేంద్రప్రసాద్‌ అందించిన కథలతోనే సినిమాలు చేశాడు. ఇతర రైటర్ల కథలతో సినిమాలు చేయకపోవడంపై రాజమౌళి రియాక్ట్ అయ్యాడు.   

PREV
15
రాజమౌళి ఇతర రైటర్ల కథలతో సినిమాలు ఎందుకు చేయడో తెలుసా? అంత పెద్ద చేదు అనుభవం ఉందా?

దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు మరోసారి ఇండియన్‌ సినిమా సత్తా ఏంటో చూపించే పనిలో ఉన్నాడు. ఆయన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. మహేష్‌ సైతం కొత్త మేకోవర్‌కి ప్రిపేర్ అవుతున్నారు. మహేష్‌ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ప్రకటన ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 

25

ఇదిలా ఉంటే రాజమౌళి ఏ సినిమా అయినా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ అందించిన కథతోనే చేస్తారు. ప్రారంభం నుంచి ఆయన అదే ఫాలో అవుతున్నాడు. ఇతర రైటర్లతో ఎందుకు సినిమాలు చేయడు, కారణం ఏంటి? ఇతర రైటర్ల కథలు నచ్చవా? లేక ఆడవనే ఆలోచనలో ఉంటారా? రాజమౌళి ఆ నిర్ణయం వెనుక అసలు కథేంటనేది ఆసక్తికరంగా మారింది. 

35

దీనికి క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. అసలు విషయం రివీల్‌ చేశాడు. ఎందుకు ఇతరుల రైటర్స్ కథలతో సినిమాలు చేయడం లేదో తెలిపాడు రాజమౌళి. ఒక దశలో ఇతర రైటర్లతో సినిమాలు చేయాలనుకున్నాడట రాజమౌళి. కథలు కూడా విన్నాడట. అలా దాదాపు 250 కథలను విన్నాడట. ఏదీ నచ్చలేదు. చాలా కథలు ఇమ్మెచ్చూర్డ్ గా(అపరిపక్వత) ఉన్నాయట. చాలా లాజిక్‌ లెస్‌గా అనిపించాయట. అవి విన్నాక దిమాక్‌ ఖరాబ్‌ అయ్యిందట. దీంతో అప్పట్నుంచి ఇక వాటి జోలికి వెళ్లడం లేదన్నారు రాజమౌళి. 

45

తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథలతోనే సినిమాలు చేయడానికి కారణం చెబుతూ, నాన్నవద్ద ఎన్ని కథలు, ఎలాంటి కథలు ఉన్నాయో నాకు తెలుసు. పైగా మా వేవ్‌ లెంన్త్ కుదిరింది. వాటిపై చాలా కూర్చుంటాం. ఫైట్‌ చేస్తాం, విమర్శించుకుంటాం. ఫైనల్‌గా మంచి కథ సెట్‌ అవుతుంది. దాన్ని సినిమాగా చేస్తామని చెప్పాడు రాజమౌళి. ఈ క్రమంలో పక్క రైటర్ల కథల వైపు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 
 

55

రాజమౌళి ఇప్పటి వరకు సుమారు 11 సినిమాలు చేశారు రాజమౌళి. అన్నీ సూపర్‌ హిట్సే. ఓటమి ఎరుగని దర్శకుడిగా నిలిచాడు. `బాహుబలి`తో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాడు. తెలుగు సినిమా స్థాయిని, ఇండియన్ మూవీ స్థాయిని పెంచాడు రాజమౌళి. ఇప్పుడు పదుల సంఖ్యలో పాన్‌ ఇండియా మూవీస్‌ రూపొందుతున్నాయంటే కారణం ఆయనే. అదే ఊపుతో ఇప్పుడు మహేష్‌ బాబుతో `ఎస్‌ఎస్‌ఎంబీ29` సినిమా చేస్తున్నారు. దీన్ని ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ రేంజ్‌లో రూపొందించబోతున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories