చిరు భారీ కటౌట్.. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి‘ వాయిదా.. నితిన్ మూవీ ఫస్ట్ సింగిల్.. శనివారం మూవీ అప్డేట్స్

First Published | Jul 29, 2023, 6:01 PM IST

శుక్రవారం రోజు ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదలవడంతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీస్ నుంచి కూడా అదిరిపోయే అప్డేట్స్ అందాయి. భోళా శంకర్, ఖుషి, ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నుంచి అఫీషియల్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
 

మెగా స్టార్ చిరంజీవి - మెహర్ రమేశ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భోళా శంకర్’. తమన్నా భాటియా కథానాయిక. కీర్తి సురేష్ చిరుకు చెల్లెలి పాత్రలో నటించింది. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రెండు వారాల్లో రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఈ సందర్భంగా మునుపెన్నడూ లేని విధంగా చిరంజీవి భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. 100 ఫీట్ల చిరంజీవి కటౌట్ ను ‘రాజు గారి తోట, సూర్యపేట’లో ఏర్పాటు చేశారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోనే హ్యాయెస్ట్ కటౌట్ గా రికార్డు క్రియేట్ చేశారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. నిన్న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ పెర్ఫామెన్స్ కు ఫిదా అవుతున్నారు. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. టాక్ అదరడంతో అదే మేనియా కొనసాగుతోంది. ఇక ఈరోజు మేకర్స్ ‘బ్రో’ మూవీల ర్యాప్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటించగా.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందించారు. తొలిరోజు కూడా 30 శాతం రికవరీని సాధించింది. 
 


స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty)  - యంగ్ స్టార్ నవీన్ పొలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty  Mister Polishetty).  ప్రభాస్‌ హోం బ్యానర్‌ యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్‌బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 4న విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే కొత్త తేదీతోపాటు ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

హీరో నితిన్ తాజాగా నటిస్తున్న ఫిల్మ్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ చకచకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే యూనిట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తోంది. తాజాగా ఫస్ట్ సింగిల్ పై అనౌన్స్ మెంట్ వచ్చింది. ఆగస్టు 2న Danger Pilla  టైటిల్ తో ఈ మ్యాజికల్ సౌండ్ ట్రాక్ రానుంది. హరీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే సాంగ్ చాలా రిచ్ గా షూట్ చేసినట్టు తెలుస్తోంది. 
 

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తైంది. మైవీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియన్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ మూవీ నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ సాంగ్స్  ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై హైప్ నూ పెంచుతున్నాయి. ఇప్పటికే ‘నా రోజా నువ్వే’ వంద మిలియన్లు వ్యూస్ ను దక్కించుకుంది. ఇక నిన్న వచ్చిన ‘ఖుషి టైటిల్ సాంగ్’ కూడా దుమ్ములేపుతోంది. ఇప్పటి వరకు ఐదు మిలియన్ల వ్యూస్ ను దక్కించుకోవడంతో పాటు యూటబ్యూల్ లో ట్రెండింగ్ లో నడుస్తోంది.  

Latest Videos

click me!