హిందీలో బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్స్ పడిపోయిన ప్రతిసారీ తాము చిరంజీవి నటించిన ఒక సినిమాని ప్లే చేసేవాళ్ళం అని సమీర్ నాయర్ తెలిపారు. ఆయన గతంలో స్టార్ నెట్ వర్క్ లో పనిచేశారు. హిందీ ఆడియన్స్ లో చిరంజీవి క్రేజ్ ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించారు. ఇప్పటికీ చిరు కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవిపై 90వ దశకంలో బిగ్గర్ దేన్ బచ్చన్ అనే ప్రశంసలు కురిశాయి. అప్పట్లో చిరంజీవి తీసుకునే రెమ్యునరేషన్ అమితాబ్ కంటే అధికంగా ఉండేదట. చిరంజీవి అలాంటి హవా చూపించారు.
25
హిందీ బుల్లితెరపై మెగాస్టార్ సత్తా
చిరంజీవి క్రేజ్ తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితం కాదు. ఈ విషయాన్ని సమీర్ నాయర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సీఈవోగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన స్టార్ నెట్ వర్క్ లో వివిధ విభాగాల్లో పనిచేశారు. టీవీ ఛానల్స్ అంటే టీఆర్పీ రేటింగ్స్ వెనుక పరిగెత్తడం సహజం. తమకి మంచి టీఆర్పీ రేటింగ్స్, వ్యూస్ తీసుకువచ్చే కంటెంట్, ప్రోగ్రామ్స్, సినిమాలపైనే వారి ఫోకస్ ఉంటుంది.
35
నార్త్ లో అదరగొట్టే చిరంజీవి సినిమా అదే
నార్త్ లో హిందీ ఆడియన్స్ అభిరుచుకి తగ్గట్లుగా టీవీ ప్రోగ్రామ్స్, సినిమాలు ఉండాలి. హిందీలో ఎప్పుడైనా టీఆర్పీ రేటింగ్స్ పడిపోతే మేము వెంటనే చిరంజీవి గారి ఇంద్ర ది టైగర్ సినిమా ప్లే చేసేవాళ్ళం. ఆ మూవీని ఎన్నిసార్లు ప్లే చేసినా అద్భుతమైన రేటింగ్స్ వచ్చేవి అని సమీర్ నాయర్ అన్నారు. నార్త్ లో తెలుగు మాస్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంద్ర ది టైగర్ అనేది చిరంజీవి ఇంద్ర చిత్రానికి హిందీ డబ్బింగ్ వెర్షన్. హిందీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని టీవీల్లో ఎగబడి చూసేవారు అని సమీర్ నాయర్ తెలిపారు.
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హిందీలో విపరీతమైన క్రేజ్ ఉంది. నార్త్ లో టెలివిజన్ లో అద్భుతంగా ప్రదర్శించబడిన చిత్రాల్లో ఇంద్ర ది టైగర్ ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ కావడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఈ సినిమా వారణాసి బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. రాయలసీమ ఫ్యాక్షనిస్టు కొన్ని పరిణామాల వల్ల వారణాసిలో అజ్ఞాత జీవితం గడుపుతుంటారు. వారణాసిలో జరిగే సన్నివేశాలు, సోనాలి బింద్రే గ్లామర్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. ఇంటర్వ్యూలు నుంచి ఈ మూవీ మరో మలుపు తిరుగుతుంది.
55
హిందీ అగ్ర చిత్రాలకు ధీటుగా
నార్త్ లో ఇంద్ర ది టైగర్ చిత్రం వైఆర్ఎఫ్ ఫిలిమ్స్, కరణ్ జోహార్ ఫిలిమ్స్, షారుఖ్ ఖాన్ సినిమాల కంటే ధీటుగా టీఆర్పీ రేటింగ్ రాబట్టింది అని హిందీ ఫిలిం క్రిటిక్స్ చెబుతున్నారు. పదేళ్లపైకి పైగా ఈ చిత్రం హిందీ బెల్ట్ లో అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్ రాబట్టింది. తెలుగులో ఇంద్ర చిత్రం మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా తెలియజేస్తూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.