బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ.. దూసుకుపోతోంది. ప్రతీ రోజు ఏదో ఒక కొత్తదనం చూపిస్తూ.. రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?
తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనంగా మారిన రియాల్టీషో బిగ్ బాస్. గత 9 ఏళ్లుగా తెలుగు ఆడియన్స్ ను అలరిస్తున్న బిగ్ బాస్ .. మళ్లీ సత్తా చాటుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలగు సీజన్ 9 రసవత్తరంగా నడుస్తోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో.. ప్రస్తుతం సీజన్ కూడా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో దూసుకుపోతోంది. ఈ సీజన్ ప్రారంభం నుంచే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తూ.. కొనసాగుతోంది. ఈసారి సరికొత్త ట్విస్ట్ లు, ఎంట్రీలు, డిఫరెంట్ గేమ్స్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీని కలిగించడంలో సక్సెస్ అయ్యారు బిగ్ బాస్ టీం. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఆడియన్స్ అంచనాలు మించి రావడంతో.. సీజన్ 9 చూసేవారి సంఖ్య పెరిగిపోయింది.
26
ట్విస్ట్‌లు, టర్న్‌లతో కొనసాగుతోంది
ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మరికొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి ప్రవేశించారు. అంతే కాదు ఎలిమినేట్ అయిన వారిలో భరణికి మరో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.. దాంతో అతను మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఆడియన్స్ కు పెద్ద ట్విస్ట్ గా మారిపోయింది. నాగార్జున మొదటి నుంచి చెపుతున్నట్టు.. నిజంగా “ఇది చదరంగం కాదు, రణరంగం” లా మారిపోయింది. ఆయన మాటలకు తగ్గట్టుగానే ఈ సీజన్ తీవ్ర పోటీ, ట్విస్ట్‌లు, టర్న్‌లతో కొనసాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే, ఈ సీజన్‌కు ప్రేక్షకుల ఆదరణ మరింతగా పెరిగిందని సమాచారం. రేటింగ్స్ కూడా మంచి స్థాయిలో ఉండటంతో, బిగ్ బాస్ యాజమాన్యం కూడా సంతోషంగా ఉందని తెలుస్తోంది.
36
హింట్ ఇస్తోన్న బిగ్ బాస్
బిగ్ బాస్ 6,7 సీజన్లు జనాలకు బోర్ కొట్టించడంతో.. ఈ షోను చూసేవారు తగ్గిపోయారు. దాంతోబిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను పెంచారు. ఇక ఈసీజన్ 8 వారాలు పూర్తయ్యాయి. దాంతో కంటస్టెంట్లపై అందరు ఒక అంచనాకు వచ్చారు. ఎవరు బిగ్ బాస్ లో చివరి వరకూ ఉంటారు. ఎవరు మధ్యలో వెళ్లిపోతారు.. అనే విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అందులో కొన్ని షాకింగ్ ఎలిమినేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే చాలా వరకూ జనాల అంచనాల ప్రకారం, బిగ్ బాస్ ఇస్తున్న హింట్ ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ 5 కంటెస్టెంట్ వీళ్లే అంటూ..ఓ చిన్న లిస్ట్ ప్రచారంలో ఉంది.
ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో స్థిరంగా ఆడుతూ.. అప్ అండ్ డౌన్స్ చూస్తూ.. జనాల మధ్య నానుతున్న వారు ఎవరో... వారే టాప్ 5 స్థానాలను దక్కించుకుంటారని అంచనా. ఈ విషయంలో టాప్ 5 పై క్లారిటీ కూడా ఇప్పుడిప్పుడే వస్తోంది. ప్రేక్షకుల ఓటింగ్, టాస్కుల్లో ప్రదర్శనలను బట్టి చూస్తే, తనూజ, సంజన, డీమాన్ పవన్, ఇమ్మానియేల్, పవన్ కళ్యాణ్.. ఈ ఐదుగురు కంటెస్టెంట్లకు టాప్ 5లో చోటు దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో ఇమ్మానియెల్ గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
56
వీళ్లు మాత్రమే ఎందుకు ..?
బిగ్ బాస్ ను ఈ సారి ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఐదుగురు నిజంగా టాప్ 5 లో ఉంటారా లేదా అనేది తెలియదు.. కానీ వీరికే ఎక్కువగా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ లో భరణి, సుమన్ శెట్టి, రీతూ చౌదరి ఉంటారని కూడా కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. కానీ భరణి రీ ఎంట్రీ తరువాత కూడా సేఫ్ గేమ్ ఆడటం మానలేదు. తానేదో అందరికంటే మంచివాడు అన్నట్టుగా.. బిహేవ్ చేస్తూ.. ఎటువంటి స్టాండ్ తీసుకోకపోవడం.. ఆడియన్స్ కు చిరాకు తెప్పిస్తోంది. ఇక సుమన్ శెట్టి ఏదో అలా ఉంటున్నాడు కానీ.. వారాలు గడిచేకొద్ది.. పోటీ తట్టుకునే కెపాసిటీ అతనికి లేదనే చెప్పాలి.. ఇక రీతూ చౌదరి మాత్రం గత సీజన్ లో విష్ణు ప్రియ మాదిరిగా లవ్ ట్రాక్ కోసం బిగ్ బాస్ ఉంచినట్టు తెలుస్తోంది. ఏ రకంగా చూసినా.. బిగ్ బాస్ లో కాస్త అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మాత్రం తనుజ, ఇమ్ము,సంజన, పవన్, డిమాన్ పవన్, పవన్ కళ్యాన్.. మాత్రమే..
66
పరిస్థితులు ఎలాగైనా మారే అవకాశం
ఈ కంటెస్టెంట్లు హౌస్‌లో టాస్కులు ఆడే విధానం, ఇతరులతో వ్యవహరించే తీరు, గేమ్ పట్ల ఉన్న సీరియస్‌నెస్ వల్ల ప్రేక్షకుల సపోర్టు ను సాధిస్తున్నారు. బిగ్ బాస్ టీమ్ కూడా వీరి గేమ్‌ను గమనించి, టాస్క్‌లలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ ఇదివరకట్లా లేదు.. ఎప్పుడు ఏట్విస్ట్ ఇస్తారో తెలియదు. భరణీకి ఒక అవకాశం ఇచ్చారు.. అది అతను మంచిగా ఉపయోగించుకుంటే టాప్ 5 లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే రాబోయే వారాల్లో పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. ఎలిమినేషన్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, సీక్రెట్ టాస్కులు — ఇవన్నీ టాప్ 5 లిస్ట్‌లో మార్పులకు కారణం కావచ్చు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.