చిరంజీవి ఎమెషనల్ అయ్యారు.. తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించినందుకు పొంగిపోయారు. ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు. మెగాస్టార్ ఇంత సంతోషంగా స్పెషల్ నోట్ ఎవరికి రాశారో తెలుసా? అసలు విషయం ఏంటంటే?
మన శంకర వర ప్రసాద్ గారు సక్సెస్ జోష్ లో చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మన శంకర వర ప్రసాద్ గారు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. రికార్డుల మోత మోగిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్నిరికార్డులు బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది చిరంజీవి సినిమా. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి.. థియేటర్లలో ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది.
25
బాక్సాఫీస్ దగ్గర మెగా మూవీ దూకుడు..
మన శంకర వర ప్రసాద్ గారు సినిమా విడుదలైన ఎనిమిదవ రోజు కూడా అద్భుతమైన వసూళ్లు నమోదు చేయగా, భారీ అడ్వాన్స్ బుకింగ్‌లతో తొమ్మిదవ రోజున మరింత జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఇప్పటికే ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్‌ను సాధించి షాక్ ఇచ్చింది. చాలా వేగంగా ఈ మార్క్‌ను చేరిన తెలుగు సినిమాగా మన శంకర వర ప్రసాద్ గారు ప్రత్యేక ఘనతను అందుకుంది. అంతేకాకుండా, ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల వసూళ్లను అధిగమించి, చిరంజీవి తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
35
మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ ఘన విజయం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక ఎమెషనల్ మెసేజ్ ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా విజయం వెనుక నిలిచిన ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, అలాగే సినిమా టీమ్ మొత్తానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లోని ప్రతి మైలురాయి తరతరాల సినీ అభిమానుల ప్రేమాభిమానాల ఫలితమేనని చిరంజీవి అన్నారు. మెగాస్టార్ ఇంకేమన్నారంటే..
“మన శంకర వర ప్రసాద్ గారు సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని చూసి నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. నేను ఎప్పుడూ మీ ప్రేమకు ప్రతిరూపమని చెబుతూనే ఉంటాను. ఈ రోజు మీరు దానిని మరోసారి నిరూపించారు. ఈ రికార్డు తెలుగు ప్రేక్షకులది, డిస్ట్రిబ్యూటర్లది, దశాబ్దాలుగా నా వెంట నిలిచిన మెగా అభిమానులది. థియేటర్లలో మీ విజిల్స్‌నే నాకు ప్రాణం. రికార్డులు వస్తాయి, పోతాయి… కానీ మీ ప్రేమ మాత్రం శాశ్వతం” అని చిరంజీవి తన సందేశంలో తెలిపారు.
55
మూవీ టీమ్ పై మెగా కామెంట్స్..
చాలా కాలం తరువాత తనకు బ్లాక్‌బస్టర్ విజయం అందించిన దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలేగే నిర్మాతలు సాహు , సుష్మితతో పాటు మొత్తం టీమ్ చేసిన కృషికి అభినందనలు తెలియజేశారు. తనపై వారు చూపిన నమ్మకానికి ఈ విజయం అంకితమని చెబుతూ, వేడుకలను కొనసాగిద్దామని అభిమానులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఈ ఎమోషనల్ మెసేజ్ ద్వారా అభిమానుల మనసును మరోసారి గెలుచుకున్నారు చిరంజీవి . ఇక ఈ మెసేజ్ ను మెగా అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.