చాలా కాలంగా మెగా అభిమానులు ఎదురు చూస్తున్న కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రామ్ చరణ్. బాబాయ్ అబ్బాయ్ కలిసి సినిమా చేస్తే చూడాలని అందరు కోరుకుంటున్నారు. మరి వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు?
మెగా ఫ్యామిలీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్, అల్లు అర్జున్... టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఇందులో చిరు, చరణ్, చరణ్ బన్నీ, పవన్ చిరు కాంబినేషన్ వెండితెరపై అప్పుడప్పుడు కనిపించింది. కానీ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే త్వరలో అభిమానులు కోరిక తీరే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు కలిసి తెరపై కనిపిస్తారా లేదా అనేది తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ నిర్మాతగా రామ్ చరణ్ సినిమా రాబోతున్నట్టు మాత్రం తెలుస్తోంది.
25
నిర్మాతగా పవన్ కళ్యాణ్ ..?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తన కెరీర్ కు సబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా కొనసాగాలనే ఉద్దేశంతో ఆయన తన నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్‌ను మళ్లీ యాక్టివ్ చేశారట. ఈ బ్యానర్‌పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థతో కలిసి వరుసగా సినిమాలను నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నాలుగు చిత్రాల్లో రెండు సినిమాల్లో ఆయనే హీరోగా నటించనుండగా, మిగిలిన రెండు సినిమాలను ఇతర హీరోలతో నిర్మించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
35
రామ్ చరణ్ తో పవన్ కళ్యాణ్ సినిమా..?
పవన్ కళ్యాన్ నిర్మించబోయే సినిమాల్లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను హీరోగా పెట్టి ఒక భారీ బడ్జెట్ సినిమాను రూపొందించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసినిమాకు పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక సినిమా ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికీ, ఇద్దరికీ వేర్వేరు కమిట్‌మెంట్లు ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లలేదు.
అభిమానులు అయితే చరణ్, పవన్ ను కలిపి వెండితెరపై చూడాలని అనుకుంటున్నారు. అయితే పవన్ ఒక వేళ నిజంగా చరణ్ తో పెద్ద సినిమా చేస్తే..అందులో ఏదో ఒక రకంగా గెస్ట్ రోల్ అయినా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం అఫీషియల్ గా ఎవరు చెప్పకపోయినా.. రూమర్ వైరల్ అవుతుండటంతో.. నిజంగా ఇది జరిగితే బాగుండు అని.. మెగా అభిమానుల అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ స్థాయి పాన్ ఇండియా స్టార్‌గా ఉంది. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాపై అభిమానులతో పాటు ఆడియన్స్ అందరిలో.. భారీ స్థాయి అంచనాల ఉంటాయి. మరి త్రివిక్రమ్ కు ఉన్న ఇమేజ్ తో ఇది సాధ్యం అవుతుందా అనేది చూడాలి.
55
త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఎవరితో?
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కార్తికేయ స్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనుండటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి నిజంగానే రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందా? అది అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉంటుందా లేదా అనేది చూడాలి?