రీసెంట్ గా సంక్రాంతి సీజన్ కు భారీ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో ఆయన బాగా అభిమానించే ఫేవరెట్ సీరియల్ నటి కూడా ఉంది. ఇంతకీ ఆమె ఎవరు? గతంలో ఏమైనా సినిమాలు చేసిందా?
చాలా కాలంగా ఫెయిల్యూర్స్ చూస్తూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సంక్రాంతి సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించి.. తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా ఎక్కేసింది. ప్రస్తుతం ఈ సినిమా ZEE5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.
25
చిరంజీవిని కొత్తగా చూపించిన అనిల్ రావిపూడి..
మెగాస్టార్ చిరంజీవిలోని ఫుల్ ఎనర్జీని మరోసారి బయటపెట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. గతంలో చిరంజీవి పెర్ఫామెన్స్ ఎలా ఉండేది అనేది మరోసారి అభిమానులకు చూపించాడు. కామెడీ, ఎమెషన్స్, యాక్షన్, డ్యాన్స్.. ఎక్కడా ఏమీ తగ్గకుండా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. యూత్ కు కావల్సిన ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యేలా సినిమాను నడిపించారు.
మరీ ముఖ్యంగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చూపించిన సీరియల్ ట్రాక్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి చాలా పెద్ద సెక్యురిటీ ఆఫీసర్ అయినా.. సాధారణ కుటుంబికుడిగా చూపించడం..మరీ ముఖ్యంగా ఒక సీరియల్‌ను రెగ్యులర్‌గా చూస్తూ ఉండడం, ఆ సీరియల్ కథను తన జీవితంతో పోల్చుకోవడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
35
మెగాస్టార్ మెచ్చిన సీరియల్ హీరోయిన్..
ఈ సినిమాలో పదే పదే కనిపించిన ఆ సీరియల్ పాత్ర పేరు సౌమ్య. ఈ సౌమ్య పాత్రలో కనిపించిన నటి అసలు పేరు సాయి ప్రియా రెడ్డి. ఈ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ స్టార్ గతంలో కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు ఫేవరెట్‌గా నిలిచిన సౌమ్య పాత్ర చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూనే... ఆడియన్స్ ను నవ్విస్తుంది.
సౌమ్య పాత్రలో కనిపించిన సాయి ప్రియా రెడ్డి తెలుగమ్మాయి. ఆమె చాలా కాలంగా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్ వంటి పలు సినిమాల్లో. అంతే కాదు కొన్ని యూట్యూబ్ సిరీస్‌లలో కూడా సందడి చేసింది సాయి ప్రియా రెడ్డి.
55
వరుస అవకాశాలు సాధిస్తోన్న సాయి ప్రియా రెడ్డి
ఇటీవల సందీప్ కిషన్ నటించిన మజాకా, అలాగే విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమాల్లో కూడా సాయి ప్రియా తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా పుణ్యమా అని ఆమెకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి.
ఈ సినిమాలో చిరంజీవికి బాగా నచ్చిన సౌమ్య పాత్రలో నటించడం, స్టేజ్‌పై షీల్డ్ అందుకోవడం ద్వారా సాయి ప్రియా రెడ్డి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. అంతే కాదు తన ఆనందాన్ని ఓ సందర్భంలో సోషల్ మీడియాలో పంచుకుంది సాయి ప్రియా. మెగాస్టార్ తో దిగిన ఫోటోలను, షూటింగ్ విశేషాలను ఇన్ స్టాలో షేర్ చేసుకుంది.