మెగాస్టార్ చిరంజీవి ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. తన కూతురి గురించి గర్వపడుతూ.. ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏం రాసుకొచ్చారంటే?
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా గుర్తింపు పొందిన చిరంజీవి... తన పిల్లల్ని కూడా ఇండస్ట్రీ వైపు నడిపించారు. కొడుకు స్టార్ హీరోగా పాన్ ఇండియాను ఏలుతుంటే.. కూతురిని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు మెగాస్టార్. ఇక తాజాగా చిరంజీవి తన కూతురు సుస్మిత కొణిదెల పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయానికి హత్తుకునే నోట్‌ను రాశారు.
25
సుస్మితపై మెగాస్టార్ ప్రేమ..
తన పోస్ట్ లో చిరంజీవి తన కూతురు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. “హ్యాపీ బర్త్‌డే నా ప్రియమైన సుస్మిత కొణిదెల. ఒకప్పుడు నా వేలిని పట్టుకుని నడిచిన చిన్నారి నుంచి, ఈరోజు బలమైన, అందమైన , బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగిన నీ ప్రయాణం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఒక తండ్రిగా నాకు ఎంతో ప్రత్యేకమైన క్షణం. ఒకప్పుడు నా సినిమాలు చూస్తూ ఆనందపడిన నువ్వు, ఇప్పుడు ఒక సినిమా నిర్మించి నాకు గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందించడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది” అని తన సందేశంలో తెలిపారు.
35
తండ్రికి సూపర్ హిట్ ఇచ్చిన సుస్మిత..
సుష్మితకు తన తండ్రితో ఎంతో అనుబంధం ఉంది. ఆమె ఎప్పుడూ తండ్రి వెన్నంటే ఉంటుంటుంది. ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుస్మిత.. చిరంజీవితో రీసెంట్ గా మన శంకరవరప్రసాదు గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈసినిమా సుస్మితకే కాదు.. చిరంజీవికి కూడా చాలా స్పెషల్ అని చెప్పాలి.
ఇదే విషయాన్ని చిరంజీవి తన సోషల్ మీడియా పోస్ట్ లో ప్రస్తావిస్తూ తన కూతురిపై గర్వం వ్యక్తం చేశారు. “నీకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, నీవు చేసే ప్రతి పనిలో అపార విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. నా ప్రియమైన హనీ పాపా, నువ్వు ఎప్పటికీ ఇలా వెలుగుతూ ఉండాలి. నీకు ఎల్లప్పుడూ నా ప్రేమఆశీర్వాదాలు ఉంటాయి” అని ఆయన పేర్కొన్నారు.
55
ప్రేరణనిచ్చే వ్యక్తి
ఈ ఏడాది జనవరిలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సుష్మిత కొణిదెల కూడా తన తండ్రితో కలిసి పని చేసిన అనుభవాల గురించి వెల్లడించారు. తనకు జీవితంలో అత్యంత ప్రేరణనిచ్చే వ్యక్తి చిరంజీవి అని ఆమె పేర్కొన్నారు.సినిమా నిర్మాణంలో ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. ప్రతి రోజు ఆయన నుంచి కొత్త విషయం నేర్చుకోవచ్చని చెప్పారు.