పుష్ప సినిమా ఫేమస్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? ఆమె వల్లే అల్లు అర్జున్ సినిమా హిట్ అయ్యిందా?

Published : Mar 10, 2026, 11:12 AM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సినిమ పుష్ప. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే పుష్ప మూవీ అంతలా ఫేమస్ అవ్వడానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా?

PREV
15
రికార్డులు తిరగరాసిన పుష్ప సినిమా..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమా పుష్ప. టాలీవుడ్ కే పరిమితం అయిన అల్లు అర్జున్ ను పాన్ ఇండియా హీరోగా మార్చిన సినిమా. తెలుగు పరిశ్రమలో హీరోలకు అందని ద్రాక్షలా ఉన్న జాతీయ అవార్డును అల్లు అర్జున్ కు వచ్చేలా చేసిన సినిమా.

 ఇలా చెప్పుకుంటూ పుష్ప రికార్డులు ఎన్నో .. పుష్పరాజ్ మ్యానియా నార్త్ లో ఎలా నడించిందంటే.. కేవలం బాలీవుడ్ లోనే పుష్ప సినిమా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందునే నేను కూడా ఒకటి అని అన్నారు ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి.

25
మల్టీ టాలెంటెడ్ స్టార్..

టాలీవుడ్‌లోనటిగా, నిర్మాతగా, హోస్ట్ గా గుర్తింపు సాధించింది మంచు లక్ష్మి. ఆమె ఏది మాట్లాడినా.. ఆ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంటుంది. అంతే కాదు మంచు పై ట్రోలింగ్ కూడా సాధారణమే. తెలుగు, ఇంగ్లీష్ కలిపి మాట్లాడే ఆమె ప్రత్యేకమైన స్టైల్ ప్రేక్షకులకు బాగా పరిచయం. అందువల్లనే ఆమె మాట్లాడే ప్రతి వ్యాఖ్య సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో ఆమె మాటలు మీమ్స్ రూపంలో వైరల్ అయ్యి.. ట్రెండ్ అవుతుంటాయి.

35
మంచు లక్ష్మి కారణంగా పుష్పకు ఫేమ్..?

పుష్ప సినిమా ఇంత ఫేమస్ అవ్వడానికి మంచు లక్ష్మి కూడా ఒక కారణం అని మీకు తెలుసా? ఆమె చెప్పిన ఓ డైలాగ్ వల్ల.. ఈసినిమా మరింత ట్రెండ్ అయ్యిందని తెలుసా? ఈ విషయం గురించి.. రీసెంట్ గా మంచు లక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఈసారి ఆమె ‘పుష్ప’లో వినిపించిన ఓ డైలాగ్ గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.ఇటీవల జరిగిన ‘లేచింది మహిళా లోకం’ సినిమా ఈవెంట్‌లో మంచు లక్ష్మి పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మూవీ టీమ్ నిర్వహించింది.

45
పుష్పలో వైరల్ అయిన మంచు డైలాగ్..

ఈ సందర్భంగా మాట్లాడిన మంచు లక్ష్మి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. “ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్” అనే డైలాగ్‌ను తానే ముందుగా ఉపయోగించానని చెప్పారు. ఈ డైలాగ్ మొదట తనదేనని, కావాలంటే పాత వీడియోలను పరిశీలించవచ్చని కూడా ఆమె పేర్కొన్నారు. మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ పాత వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు.

55
ఫ్లవర్ కాదు నేను ఫైర్ అంటూ...

నిజానికి చాలా కాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు మంచు లక్ష్మి తన వ్యక్తిత్వం గురించి వివరిస్తూ ఆ డైలాగ్ ను ఉపయోగించారు. ఆ ఇంటర్వ్యూలో “నన్ను చాలా మంది ఫ్లవర్ అనుకుంటారు కానీ నేను ఫైర్” అంటూ డైలాగ్ విసిరారు. ఇప్పుడు ఆ పాత వీడియోలను నెటిజన్లు తిరిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories