చిరంజీవి కౌబాయ్ గా నటించిన చిత్రంలో మోహన్ బాబు పాత్ర విషయంలో పెద్ద మిస్టేక్ జరిగింది. ఆ మూవీ ఫ్లాప్ కాకుండా పరుచూరి బ్రదర్స్ ఎలా కాపాడారో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ లో కౌబాయ్ చిత్రాలు ప్రారంభించింది సూపర్ స్టార్ కృష్ణ. ఆ తర్వాత ఆ చిత్రాలని మెగాస్టార్ చిరంజీవి కొనసాగించారు. చిరంజీవి నటించిన కొదమసింహం మూవీ 1990లో విడుదలైంది. ఈ చిత్రాన్ని లెజెండ్రీ నటుడు కైకాల సత్యనారాయణ సోదరుడు కైకాల నాగేశ్వర రావు నిర్మించారు. చిరంజీవితో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితే కైకాల నాగేశ్వర రావు ఈ చిత్రాన్ని 4 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించారు.
DID YOU KNOW ?
చిరంజీవి మూవీ సీన్ రాజమౌళి చిత్రంలో..
కొదమసింహం చిత్రంలో గుర్రం సన్నివేశం ఆధారంగా మగధీర మూవీలో రాజమౌళి ఒక సీన్ పెట్టారు. కొదమసింహంలో చిరంజీవి తనని కాపాడిన గుర్రానికి కృతజ్ఞత చెప్పరు. కానీ మగధీరలో రాంచరణ్ గుర్రానికి కృతజ్ఞత చెప్పే విధంగా సీన్ ఉంటుంది.
25
భారీ బడ్జెట్ లో కొదమసింహం
కౌబాయ్ చిత్రం కావడం, అడ్వెంచర్ అంశాలు ఉండడంతో చాలా రియల్ లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. అందుకే అంత బడ్జెట్ అయింది. అద్దె చిత్రాన్ని ఇప్పుడు నిర్మించాలి అంటే వందల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని అంటుంటారు. ఈ చిత్రంలో చిరంజీవిని ఇసుకలో మెడ వరకు పూడ్చి పెట్టి ఉంటారు. తన గుర్రం చిరంజీవిని రక్షిస్తుంది. ఆ సన్నివేశం తనకి ఏమాత్రం నచ్చలేదని రాజమౌళి పలు సందర్భాల్లో తెలిపారు.
35
రాజమౌళికి నచ్చని సీన్
తనని కాపాడిన గుర్రానికి చిరంజీవి కృతజ్ఞత చెప్పలేదని అందుకే ఆ సీన్ తనకి నచ్చలేదని అన్నారు. దీనితో మగధీరతో రాంచరణ్ చేత గుర్రానికి కృతజ్ఞత చెప్పించానని రాజమౌళి అన్నారు. ఇక కొదమ సింహం విషయానికి వస్తే ఈ చిత్రం కోసం చాలా మంది రచయితలే పనిచేశారు. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ తో పాటు ఈ చిత్ర కథని డెవలప్ చేయడంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా సాయం అందించారట.
ముందుగా ఈ కథ రెడీ అయినప్పుడు పరుచూరి బ్రదర్స్ ఈ ప్రాజెక్ట్ లో లేరు. చిరంజీవికి కథ ఎక్కడో తేడాగా అనిపించింది అట. ఒక్కసారి పరుచూరి బ్రదర్స్ ఒపీనియన్ తీసుకుందాం అని చిరంజీవి వాళ్ళని పిలిపించారు. సత్యానంద్ కథ చెప్పిన వెంటనే పరుచూరి బ్రదర్స్ అందులో ఉన్న బ్లండర్ మిస్టేక్ ని కనిపెట్టేశారు. సత్యానంద్ చెప్పిన వర్షన్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ లోనే మోహన్ బాబు పోషించిన సుడిగాలి పాత్ర చనిపోతుంది.
55
అలా చేసి ఉంటే మూవీ ఫ్లాప్
దీనితో వెంటనే పరుచూరి బ్రదర్స్.. హీరో తల్లిదండ్రుల గురించి తెలిసింది మోహన్ బాబుకి మాత్రమే. ఆ పాత్ర ఇంటర్వెల్ లోనే చనిపోతే సెకండ్ హాఫ్ పై ఆడియన్స్ కి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పారు. దీనితో చిరంజీవి అలా అయితే మోహన్ బాబు పాత్ర సెకండ్ హాఫ్ లో ఉంటే స్టోరీ ఎలా ఉండాలో రాయమని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారు. ఆ విధంగా కొదమసింహం చిత్రంలో పరుచూరి బ్రదర్స్ భాగమయ్యారు. కొండవీటి దొంగ తర్వాత విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.