అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ
తెలుగు సినీ పరిశ్రమలోకి అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు నాగార్జున. ఇండస్ట్రీలో యువసామ్రాట్ గా, టాలీవుడ్ మన్మధుడిగా, కింగ్ నాగార్జునగా వెలుగు వెలిగాడు. టాలీవుడ్ కు నాలుగు స్థంభాల్లా నిలిచిన హీరోలలో, చిరంజీవి, వెంకటేష్,బాలయ్యతో పాటు నాగార్జున కూడా ఓ పిల్లర్ లా నిలబడ్డారు. అక్కినేని నట వారసుడిగా మాత్రమేకాదు, బిజినెస్ లను కూడా అంతే సమర్దవంతంగా నిర్వహిస్తూ, భారీగా ఆస్తులు కూడా కూడబెట్టారు నాగార్జున. హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, బిజినెస్ మెన్ గా నాగార్జున ప్రతీ రంగంలో సక్సెస్ అయ్యారు. అక్కినేని ఇద్దరు కొడుకులలో నాగార్జున మాత్రమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున అన్న వెంకట్ మాత్రం బిజినెస్ మెన్ గా సెటిల్ అయ్యారు.