Chiranjeevi Politics: కేంద్రమంత్రిగా చిరంజీవి, మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీపై మెగాస్టార్‌ ఏం చెప్పాడంటే?

Published : Feb 12, 2025, 08:29 AM IST

Chiranjeevi Politics: చిరంజీవి కేంద్ర మంత్రి పదవి తీసుకోబోతున్నారని, జనసేన తరఫున రాజ్యసభ సీటు తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి రాజకీయ ఎంట్రీపై స్టేట్మెంట్‌ ఇచ్చారు. 

PREV
15
Chiranjeevi Politics: కేంద్రమంత్రిగా చిరంజీవి, మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీపై మెగాస్టార్‌ ఏం చెప్పాడంటే?
Chiranjeevi on Politics:

Chiranjeevi Politics: మెగాస్టార్‌ చిరంజీవి గతంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2008లో ఆయన ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించాడు. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు 18 సీట్లు వచ్చాయి. కొన్నాళ్లు ప్రతిపక్షంలో ఉన్న చిరంజీవి ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశాడు. రాజ్యసభకి ఎంపికై టూరిజం శాఖలో కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. 

25
Chiranjeevi on Politics:

కేంద్ర మంత్రి పదవి కాలం వరకు రాజకీయాల్లోయాక్టివ్‌గా ఉన్న ఆయన ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల గత ఎన్నికలకు ముందు నుంచి మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. ప్రత్యక్షంగా రాజకీయాల్లోపాల్గొనలేదు. కానీ రాజకీయ వేదికల్లో కనిపించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు. తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కి సపోర్ట్ చేశారు. అలాగే కొందరు నాయకులను గెలిపించాలని వీడియోలు విడుదల చేశారు. మరోవైపు ప్రధాని మోడితో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నారు. అదే సమయంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌ రెడ్డితోనూ క్లోజ్‌గా ఉంటున్నారు. 
 

35
Chiranjeevi on Politics:

ఈ నేపథ్యంలో మరోసారి చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. బీజేపీకి దగ్గరగా ఉండటంతో ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారనే పుకార్లు వ్యాపించారు. పైగా ఇటీవల మోడీతో కలిసి కిషన్‌ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగానికి సంబంధించిన  సమ్మిట్‌లోనూ జూమ్‌లో మోడీతో మాట్లాడారు. ఈ పరిణామాలన్నీ చిరంజీవి రాజకీయాల వైపు మొగ్గుచూపిస్తున్నారనే వార్తలకు బలం చేకూర్చింది. వరుసగా పుకార్లు వినిపిస్తున్నాయి. 

45
Pawan Kalyan, Janasena

దీంతో తాజాగా దీనిపై చిరంజీవి స్పందించారు. రాజకీయాల్లోకి తాను రావడం లేదని తెలిపారు. మరోసారి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని, ఈ జీవితానికి తాను సినిమా కళామతల్లికే అంకితం అని స్పష్టం చేశారు. చిరంజీవి మాట్లాడుతూ, `చాలా మంది అనుమానాలు వస్తున్నాయి. ఎవరితో సన్నిహితంగా మెలిగినాన సినీ రంగానికి నా వంతు సేవలండించడానికే తప్ప దాని వెనుక రాజకీయ ఆలోచన లేదు. పొలిటికల్‌గా ముందుకెళ్లడానికి నేననుకున్న లక్ష్యాలు, సేవలను కొనగించడానికి పవన్‌ కళ్యాణ్‌ ఉన్నాడు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ, అభిమానులను అక్కున చేర్చుకుని కళామతల్లితోనే ఉంటాను` ని వెల్లడించారు చిరంజీవి. తాను రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

55
Chiranjeevi on Politics:

బ్రహ్మానందం, ఆయన కొడుకు గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన `బ్రహ్మా ఆనందం` మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి చిరంజీవి గెస్ట్ గా వెళ్లారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నారనే రూమర్స్ కి చెక్‌ పెడుతూ ఈ స్టేట్మెంట్‌ ఇచ్చారు. `బ్రహ్మా ఆనందం` మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. 

read  more: ఇంట్లో చుట్టూ ఆడపిల్లలే, హాస్టల్‌ కి వార్డెన్‌లా ఉన్నా, అరే చరణ్‌ ఒక అబ్బాయిని ఇవ్వురా.. చిరుపై ట్రోల్స్

also read: Ram Charan New films: రామ్‌ చరణ్‌ రెండు ఊహించని కాంబినేషన్స్.. మైథలాజికల్‌ మూవీ కూడా?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories