ఊటీలో చిరంజీవి కొత్త ప్రాపర్టీ.. ఎన్ని కోట్లు విలువ, ఏమిటి దాని ప్రత్యేకత?

First Published Oct 7, 2024, 7:08 AM IST

 ఊటి అవుట్ స్కర్ట్స్ లో ఈ ప్రాపర్టీ ప్రైమ్ ప్రాపర్టీ అవుతుందని భావిస్తున్నారట. రీసెంట్ గా రామ్ చరణ్, ఉపాసన కూడా ఆ ప్రాపర్టీని చూసి వచ్చారట. 

Chiranjeevi, Ooty, Vishwambhara


వయస్సు తో సంభందం లేకుండా వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. క్రితం సంక్రాతికి వాల్తేరు వీరయ్యతో  మాస్ సక్సెస్ ని  సొంతం చేసుకున్న ఆయన విశ్వంభరతో ఇండస్ట్రీ రికార్డ్ లు తిరగరాయటానికి రెడీ అవుతున్నారు.  అదే సమయంలో ఆయన స్దలాల మీద  భారీ పెట్టుబడుతున్నారు.

చిరంజీవికి హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాపర్టీస్ ఉన్నాయి. తాజాగా ఆయన ఊటీలో ఓ ప్రాపర్టీ కొన్నారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఆ ప్రాపర్టీ ఎంతకు కొన్నారు. ఏమిటి ఆ ప్రాపర్టీ ప్రత్యేకత వంటి వివరాలు చూద్దాం.

Chiranjeevi, Ooty, Vishwambhara


చిరంజీవికు వివిధ ప్రాంతాల్లో ఇళ్లు ఉన్నాయని ఆయనే  తెలిపారు. ఇప్పుడు హాలిడే కోసం గోవా, ఊటీ లాంటి ప్రదేశాల్లోనూ ఆయన గృహాలను నిర్మించుకున్నట్లు స్పష్టం చేశారు.

గోవా ప్రాపర్టీ దాదాపు సిద్ధమైందని, ఇది తన కుమారుడు రామ్ చరణ్ అభిరుచికి తగినట్లుగా నిర్మించినట్లు చెప్పారు. అలాగే  చిరంజీవికి చెన్నైలోనూ రెండు బంగ్లాలు ఉన్నాయి. హైదరాబాద్‍‌ జుబ్లీహిల్స్ ప్రాంతంలో భారీగా ఆస్తులు ఉన్నట్లు చెప్తారు. 

Latest Videos


Chiranjeevi, Ooty, Vishwambhara

హైదరాబాద్ లో బంగ్లా కూడా..


చిరంజీవికి హైదరాబాద్ నగరంలో అత్యంత విశాలమైన,  విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇది రూ. 30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు.


ఇప్పుడు ఊటీలో కొన్న ప్రాపర్టీ విషయానికి వస్తే.

 ఓ కొండమీద చుట్టూ టీ గార్డెన్స్ తో కూడిన అద్బుతమైన వ్యూ తో ఈ కొత్త ప్రాపర్టీ ఉందిట. చూడగానే చిరంజీవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసారట. ఈ ప్రాపర్టీని చిరంజీవి  16.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సినిమా వర్గాల సమచారం. ఊటి అవుట్ స్కర్ట్స్ లో ఈ ప్రాపర్టీ ప్రైమ్ ప్రాపర్టీ అవుతుందని భావిస్తున్నారట. రీసెంట్ గా రామ్ చరణ్, ఉపాసన కూడా ఆ ప్రాపర్టీని చూసి వచ్చారట. అక్కడ లావిష్ గా ఫామ్ హౌస్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఫర్మిషన్స్ కోసం ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని వినికిడి. 
  


ఊటీలో చాలా మంది ప్రముఖులు, బిజినెస్ మ్యాన్ లు  విలాసవంతమైన ప్రాపర్టీలు కొంటున్నారు. అదే పద్దతిలో మెగాస్టార్ కూడా అక్కడ ప్రాపర్టీ తీసుకున్నారని చెప్తున్నారు.  అయితే చిరంజీవికి ఇప్పటికే బెంగళూరులో ఫాంహౌస్‌ ఉంది.  

వైజాగ్ సముద్ర తీరంలో తను కొంత భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. విశాఖపట్నంలో మెగాస్టార్ కేవలం హాలీడే కోసం మాత్రమే ఇల్లు నిర్మించబోతున్నారని, అంతకుమించి మరేమి లేదని స్వయంగా ఆయనే వెల్లడించారు. 


కెరీర్ పరంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, భోళా శంకర్ ల రిజల్ట్ తర్వాత ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు.  ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాలకే మొగ్గుచూపుతున్నారు. రిస్క్ తీసుకోవటానికి ఆసక్తి చూపటం లేదు. అలాగే ప్రయోగాత్మక సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్తున్నారు.  

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నిన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు అందుకున్న సంగతి తెలిసిందే. 156 మూవీల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు ఈ రికార్డుని సాధించారు చిరు. ఈ అవార్డును బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అందుకున్నారు.

click me!