వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆడియన్స్ కు ఎంటర్ టైమ్మెంట్ తో పాటు..టాస్క్ లలో కిక్కు కూడా ఇవ్వాలి అనుకున్నాడు బిగ్ బాస్ అందుకే వైల్డ్ కార్డ్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. గత సీజన్లలో కాకుండా.. ఈసారి ఏకంగా ఎనిమిదిమంది వైల్డ్ కార్డ్స్ ను హౌస్ లోకి ఒకేసారి పంపించాడు. ఆవైల్డ్ కార్డ్స్ అందరినిని కలిపి ఒక క్లాన్ గా చేశాడు.
ఇక ఆ క్లాన్ లో మొదటిగా వెళ్ళింది హరితేజ ఆమె బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ సీజన్ లో హరితేజ్ హరికథకు అందరు పడిపోయారు. ఇక విమర్శించడం.. మాటలు విసరడంలో ఈమె తరువాతనే ఎవరైనా.