హీరోగా రీఎంట్రీ ఇస్తున్న చిరంజీవి తమ్ముడు.. `హరుడు` గ్లింప్స్ ఎలా ఉందంటే?

First Published | Oct 6, 2024, 11:46 PM IST

`అన్నయ్య`, `శివరామ రాజు` వంటి చిత్రాల్లో హీరోలకు తమ్ముడి పాత్రలో పాపులర్‌ అయిన వెంకట్‌ ఇప్పుడు కొంత గ్యాప్‌ తర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమా విశేషా చూద్దాం. 
 

హీరో వెంకట్‌ ఒకప్పుడు హీరోగా, నటుడిగా మెప్పించారు. చిరంజీవి `అన్నయ్య`, జగపతిబాబు `శివ రామ రాజు`, `ఆనందం` వంటి చిత్రాలతో మెప్పించారు. `శ్రీ సీతా రాముల కళ్యానం చూతము రారండి` సినిమాతో హీరోగా మారిన వెంకట్‌.. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. మోడల్‌గా చాలా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. షర్ట్స్, బనియన్స్ యాడ్స్ కి ఆయన కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచే వారు. ఈక్రమంలో ఆయన్ని చూసిన నాగార్జున.. `శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి` సినిమాకి ఎంపిక చేశారు. ఏఎన్నార్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో వెంకట్‌ యంగ్‌ హీరోగా మెరిశారు. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. దీంతో వరుసగా సినిమాలు క్యూ కట్టాయి వెంకట్‌కి. 
 

ఇలా వరుసగా చిరంజీవికి తమ్ముడిగా `అన్నయ్య` సినిమాలో నటించాడు. రవితేజ కూడా ఇందులో మరో తమ్ముడిగా కనిపించిన విసయం తెలిసిందే. `భలేవాడివి బాసు`, `ఆనందం`, `శివరామరాజు`, `ఛార్మినార్‌`, `థ్రిల్‌`, `కొంచెం కొత్తగా`, `సలీమ్‌`, `ఆ ఐదుగురు`వంటి సినిమాలు చేశారు. కానీ హీరోగా సక్సెస్‌ కాలేదు. దీంతో సినిమాలకు బ్రేక్‌ తీసుకున్నారు. ఆరేడు ఏళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య `రన్‌` చిత్రంలో మెరిశారు. కానీ అది ఆడలేదు. ఇటీవల `ఇచట వాహనములు నిలుపరాదు` సినిమాలోనూ కనిపించాడు. కానీ ఇది కూడా సక్సెస్‌ కాలేదు. దీంతోపాటు `ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు` సినిమా చేశాడు. వెంకట్‌ ఇందులో చేశాడనే విషయమే జనాలకు తెలియదు.
 


రీఎంట్రీ సరైన విధంగా జరగలేదు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి హీరోగా తానేంటో నిరూపించుకునేందుకు వస్తున్నాడు. అందులో భాగంగా `హరుడు` అనేసినిమాలో నటించారు. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు వెంకట్‌. మాస్‌ రోల్‌లో అలరించబోతున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా వెంకట్‌ కనిపిస్తున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. పవర్‌ఫుల్‌ రోల్‌లో వెంకట్‌ అదరగొట్టాడు. సినిమా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ మూవీకి రాజ్‌ తాళ్లూరి దర్శకుడు. డాక్టర్‌ ప్రవీణ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. హేబా పటేల్ హీరోయిన్‌గా నటించింది. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న `హరుడు` చిత్రం గ్లింప్స్ రిలీజ్‌ సందర్భంగా టీమ్‌ స్పందించారు. 
 

హీరో వెంకట్ మాట్లాడుతూ, `హరుడు` చిత్రం కమర్షియల్ ఎలిమెంట్ తో మాస్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా 60 శాతం పూర్తయింది. నిర్మాత డాక్టర్ అయినా...  సినిమా పై తపనతో వచ్చారు. ఆయనకు మంచి హిట్ పడాలని ఆశిస్తున్నాను. నాకు పవర్ ఫుల్ రోల్ దర్శకులు ఇచ్చారు. మాస్ పాత్ర నేను మొదటిసారి చేశాను. నా పాత్రకు ధీటుగా హెబ్బాపటేల్ పాత్ర వుంటుంది. డబ్బింగ్ లో ఆమె నటన చూశాను. అలాగే నటశాసింగ్ మరో పాత్ర చేసింది. స్పెషల్ సాంగ్ లో సలోని చేశారు. ఇందులో ఐదు పాటలున్నాయి. సంగీత దర్శకుడు మణి జెన్నా మంచి బాణీలు ఇచ్చారు. మాస్ సినిమాకు ఫైట్స్ కీలకం. శివరాజ్ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. లోగడ షూటింగ్ లో నాకు గాయాలు అయ్యాయి. అందుకే కొంత గ్యాప్‌ కూడా తీసుకున్నాను. ఈ సినిమాలో తగు జాగ్రత్తలు తీసుకుని ఫైట్స్ చేశాను. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం` అని చెప్పారు.
 

నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ,  `సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమా దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్ళు పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా పటేల్ నటించారు. ఇందులోని పాటలు ఆదరణ పొందేలా వున్నాయి. జెన్నా పాటలకు సంగీతం బాగా సమకూర్చారు. ఈరోజు విడుదలైన గ్లింప్స్ చాలా బాగున్నాయి. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా` అని అన్నారు. దర్శకుడు రాజ్ తాళ్ళూరి  మాట్లాడుతూ, ఐదు నిముషాల్లోనే కథ విని ఓకే చేసిన నిర్మాతకు థ్యాంక్స్. వెంకట్ తో ఐదేళ్ళ జర్నీ వుంది. లవర్ బాయ్ గా చేసిన ఆయన మాస్ హీరోగా ఇందులో చేశారు. నటశాసింగ్  కూడా నటించింది. సంగీత దర్శకుడు జిన్నా, ఎడిటర్ మారుతీ బాగా పనిచేశారు. నాకు దర్శకుల టీమ్ సపోర్ట్ గా వుండడంతో అవుట్ పుట్ బాగా వచ్చింది` అని చెప్పారు. 
 

Latest Videos

click me!