మెగాస్టార్ చిరంజీవి అంటే మాస్ హీరో. అంతకు మించిన కమర్షియల్ హీరో. ఆయన సినిమాల్లో అన్నీ ఉండాలి. పాటలుండాలి, డాన్సులుండాలి, ఫైట్లు ఉండాలి, పవర్‌ఫుల్ డైలాగులుండాలి అంతకు మించిన ఫన్ ఉండాలి. అప్పుడే ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి సినిమా కమర్షియాలిటీకి మారు పేరు అనేలా ముద్ర పడింది. అయితే ఆ ఇమేజ్‌ని దాటి ఆయన కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. `చంటబ్బాయి`, `స్వయంకృష్ణ`, `రుధ్రవీణ`, `ఆపద్భాందవుడు` వంటి సినిమాలు చేశారు. వాటితోనూ హిట్ కొట్టి తనపై ఉన్న కమర్షియల్ హీరో అనే ముద్రని కొంత చెరిపేశారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయినా ఆడియెన్స్, అభిమానులు మాత్రం చిరంజీవి సినిమాల్లో ఆ అంశాలుండాల్సిందే అంటారు. అయితే చిరంజీవి మరో ప్రయోగం చేశారు. చెల్లెళ్లు సెంటిమెంట్‌తోనే సినిమాలు చేశారు. అందులో ప్రధానంగా నిలిచింది `హిట్లర్`. చెల్లెలు సెంటిమెంట్‌తో ఈ మూవీ రూపొందింది. ఇందులో మెగాస్టార్‌కి ఐదుగురు చెలెళ్లు ఉంటారు. వాళ్ల కోసం, వారికి అండగా అన్నగా నిలబడమే ఈ సినిమా కథ. సెంటిమెంట్ గా ఉంటుంది. ఈ మూవీకి మలయాళంలో వచ్చిన `హిట్లర్`కి రీమేక్. అక్కడ మమ్ముట్టి నటించగా పెద్ద హిట్ అయ్యింది. దీన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేయాలనుకున్నారు.
ఎడిటర్ మోహన్ ఈ మూవీని సెట్ చేశారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒరిజినల్‌లో అన్నయ్య చెల్లి ప్రేమని వ్యతిరేకిస్తాడు. అడ్డుకుంటాడు. అక్కడ ఇది వర్కౌట్ అయ్యింది. కానీ తెలుగులో ఆడుతుందా అనేది డౌట్. అయితే అప్పటికే చిరంజీవికి వరుస ఫ్లాప్‌లున్నాయి. `బిగ్ బాస్`, `రిక్షావోడు` చిత్రాలు పరాజయం చెందాయి. బ్యాక్ టూ బ్యాక్ రెండు పరాజయాలు చెందడంతో చిరంజీవి డౌన్ అయ్యారు. సినిమాలు చాలా సెలక్టీవ్‌గా చేయాలని నిర్ణయించుకున్నారు. కొంత గ్యాప్ కూడా తీసుకున్నారు.
అయితే ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలో ఆ ఆఫీస్‌లో పనిచేసే అబ్బాయి కథ విని ఈ మూవీ తెలుగులో ఆడదని చెప్పాడట. దీంతో ఎడిటర్ మోహన్(దర్శకుడు మోహన్ రాజా తండ్రి)కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఆయనే ఈ సినిమాని నిర్మించారు. దీంతో ఏంటీ ఇలా చెప్పాడనుకున్నాడట.
ఎలా చేస్తే బాగుంటుందని అడగ్గా, చెల్లెలు అంటే అంత ప్రేమ ఉన్న హీరో, ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు, అలా అడ్డుకుంటే ఆయన విలన్ అయిపోతాడు, హీరో ఎలా అవుతాడు అన్నాడట. ఈ పాయింట్ ఎడిటర్‌కి బాగా నచ్చింది. దీంతో స్క్రిప్ట్ ని మళ్లీ మార్చేశారు. అయితే మెయిన్ పాయింట్‌ని అలానే ఉంచారు.
కాకపోతే ఎందుకు చెల్లెలి ప్రేమని అన్న వ్యతిరేకిస్తున్నాడనేదానికి బలమైన కారణాన్ని రాశారట. పెద్ద చెల్లెలు ప్రేమ పెళ్లిళ్లు విఫలం కావడంతో ప్రేమని హీరో వ్యతిరేకిస్తాడు అనే పాయింట్‌ని పెట్టి దానికి జస్టిఫికేషన్ చేశారు. ఈ మార్పుతో సినిమా థియేటర్లోకి వచ్చింది. మంచి విజయాన్ని సాధించింది. వరుస పరాజయాల్లో ఉన్న మెగాస్టార్‌కి మంచి రిలీఫ్‌నిచ్చింది.
ఆ తర్వాత మెగాస్టార్ సక్సెస్ బాట పట్టాడు. `హిట్లర్` తర్వాత `మాస్టర్`తో హిట్ కొట్టాడు. `బావగారు బాగున్నారా?` `చూడాలని ఉంది`, `స్నేహం కోసం`, `ఇద్దరు మిత్రులు`తో వరుసగా డీసెంట్ హిట్స్ అందుకున్నారు. డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తర్వాత `అన్నయ్య`తో దెబ్బ పడింది. `మృగరాజు`, `శ్రీమంజునాథ`, `డాడీ` చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ పరాజయం చెందాయి.
`ఇంద్ర`తో బ్లాక్ బస్టర్ కొట్టి ఇండస్ట్రీలో తిరుగులేని మెగాస్టార్ అయిపోయారు. ఇప్పటికీ అదే రేంజ్‌లో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుంది.
read more: స్టార్ హీరోయిన్‌తో రాజేంద్రప్రసాద్‌కి ఉత్తమ జంటగా సత్కారం.. ఇంటికెళ్లాక నటకిరీటి భార్య ఏం చేసిందో తెలుసా?