చిరు, బాలయ్య, నాగ్, వెంకీల 50వ చిత్రం ఏమిటీ? ఎవరిది పై చేయి, అసలు ఊహించి ఉండరు!

First Published | Nov 1, 2024, 8:35 AM IST

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల 50వ చిత్రం ఏమిటో తెలుసా? వాటి ఫలితాలు ఏమిటీ? ఎవరిది పై చేయి అంటే? ఇంట్రస్టింగ్ స్టోరీ 

ఒకప్పుడు హీరోలు ఏడాదికి పదుల సంఖ్యలో చిత్రాలు చేసేవారు. ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి స్టార్స్ సైతం పదికి పైగా చిత్రాలను ఒకే ఏడాది విడుదల చేసేవారు. ఇక కృష్ణ అయితే చెప్పాల్సిన పని లేదు. 1972లో కృష్ణ ఏకంగా 18 సినిమాలు విడుదల చేశారు. అప్పటి పరిస్థితులు అందుకు సహకరించాయి.

Star heroes 50th Movies

దాదాపు అన్ని సినిమాలు గ్రామీణ నేపథ్యంతో కూడుకుని ఉండేవి. పారిన్ లేదా ఇతర రాష్ట్రాల్లో షూటింగ్స్ అనేవి తక్కువగా ఉండేవి. సెట్స్ లేదంటే గోదావరి జిల్లాల్లో మూవీ షూటింగ్స్ పూర్తి చేసేవారు. హీరోలు సైతం రోజుకు మూడు షిఫ్ట్స్ పని చేసేవారు. మెల్లగా సమీకరణాలు మారుతూ వచ్చాయి. సాంకేతికత పెరగడంతో క్వాలిటీతో కూడిన సినిమాలు ప్రేక్షకులకు అందించేందుకు నటులు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. 

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎంత మంచి చిత్రాలు ఇచ్చామన్నదే పరిగణలోకి తీసుకుంటున్నారు. దర్శకులు సైతం ఒక ప్రాజెక్ట్ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయడానికి రెండు మూడేళ్ళ సమయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం టాప్ స్టార్స్ గా ఉన్న మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనమైపోయింది. పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చాక ఒక్కో సినిమాకు రెండు మూడేళ్ళ సమయం తీసుకుంటున్నారు. 
 


చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలు విడుదల చేస్తున్నారు. గతంలో వీరు కనీసం ఐదారు చిత్రాలు విడుదల చేసేవారు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి చకచకా సినిమాలు చేశాడు. అందిన ప్రతి అవకాశం ఉపయోగించుకున్నాడు. దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏలిన ఈ నలుగురు హీరోల్లో చిరంజీవి అత్యధికంగా చిత్రాలు చేశాడు. చిరంజీవి 156 చిత్రాల్లో నటించారు. 

కాగా 25, 50,75,100వ చిత్రాలను నటులు మైలురాళ్లుగా భావిస్తారు. అద్భుతమైన కథతో సదరు చిత్రాలు చేయాలని అనుకుంటారు. కాగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ల 50వ చిత్రాలు ఏమిటి? వాటి ఫలితం ఏమిటి? అని పరిశీలిస్తే.. 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన చిరంజీవి కేవలం ఐదేళ్ల వ్యవధిలో 50 సినిమాలు పూర్తి చేశారు. 
 

Star heroes 50th Movies


చిరంజీవి 50వ చిత్రం ప్రేమ పిచ్చోళ్ళు. ఈ చిత్రానికి ఏ. కోదండరామిరెడ్డి దర్శకుడు. 1983లో ప్రేమ పిచ్చోళ్ళు మూవీ విడుదలైంది. రాధిక హీరోయిన్ గా నటించింది. గుమ్మడి, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య కీలక రోల్స్ చేశారు. కే. చక్రవర్తి సంగీతం అందించారు. ప్రేమ పిచ్చోళ్ళు మూవీ అంతగా ఆడలేదు. కానీ అదే ఏడాది ఖైదీ రూపంలో చిరంజీవికి ఏ. కోదండరామిరెడ్డి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఆ మూవీ చిరంజీవి దశ మార్చేసింది. స్టార్ హీరోని చేసింది. 
 

Star heroes 50th Movies

బాలకృష్ణ 50వ చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ మూవీకి కూడా ఏ. కోదండరామిరెడ్డి దర్శకుడు. శోభన, నిరోషా హీరోయిన్స్ గా నటించారు. శారద, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య కీలక రోల్స్ చేశారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్. కేవీ మహదేవన్ స్వరపరచిన ప్రతి పాట ఒక ఆణిముత్యం. ఒక్క ఫైట్, మాస్ డైలాగ్ లేకుండా బాలకృష్ణ నారీ నారీ నడుమ మురారి చిత్రం చేశారు. సినిమా చాలా బాగుంటుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. 50వ చిత్రంతో బాలకృష్ణ హిట్ కొట్టారు. 
 

Star heroes 50th Movies

ఇక నాగార్జున 50వ చిత్రం ఆకాశ వీధిలో. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు కావడం విశేషం. అంజల జవేరి, రవీనా టాండన్ హీరోయిన్స్ గా నటించారు. నాగార్జున నటించిన ఆకాశ వీధిలో చిత్రానికి రామోజీ రావు నిర్మాత. కీరవాణి సంగీతం అందించారు. ఆకాశవీధిలో యావరేజ్ అని చెప్పాలి. పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. 

Star heroes 50th Movies

 విక్టరీ వెంకటేష్ 50వ చిత్రంగా నువ్వు నాకు నచ్చావ్ చేశారు. ఆర్తి అగర్వాల్ ని తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రంతో పరిచయం చేశారు. రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామాగా నువ్వు నాకు నచ్చావ్ తెరకెక్కింది. కే విజయ భాస్కర్ దర్శకుడు. నువ్వు నాకు నచ్చావ్ బ్లాక్ బస్టర్ కొట్టింది. త్రివిక్రమ్ డైలాగ్స్, కోటి పాటలు హైలెట్. కాబట్టి 50వ చిత్రాల విషయంలో వెంకటేష్ దే పై చేయి. వెంకటేష్ కి బ్లాక్ బస్టర్ పడింది. చిరంజీవికి ప్లాప్, నాగార్జునకు యావరేజ్, బాలకృష్ణకు సూపర్ హిట్ దక్కాయి. 
 

Latest Videos

click me!