ఒకే ఫ్రేములో చిరంజీవి, బాలయ్య.. ఫోటో వెనుక కథ, నటసింహం చేయాల్సిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన చిరు

Published : Aug 31, 2025, 04:20 PM IST

ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఒకే ఫ్రేములో కనిపిస్తుండటంతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సన్నివేశం ఏ సినిమా సమయంలో చోటు చేసుకుందనేది ఆసక్తికరంగా మారింది. 

PREV
15
చిరంజీవి, బాలయ్య అరుదైన ఫోటో వెనుక కథ

ఈ ఫోటోలో మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ కనిపిస్తున్నారు. పక్కన నిర్మాత అశ్వినీదత్‌ ఉన్నారు. ఈ అరుదైన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది అటు చిరు, ఇటు బాలయ్య అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఫోటో ఎప్పటిది, ఏ సినిమా సమయంలో ఈ దృశ్యం చోటు చేసుకుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఫోటో వెనుక కథ చూస్తే, ఇది చిరంజీవి నటించిన `ఇంద్ర` మూవీ సెట్‌లోనిది. చిరంజీవిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో పక్కనే ఉన్న బాలయ్య సెట్‌కి వచ్చారు. బ్రేక్‌ సమయంలో సరదాగా వీరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటం విశేషం.

25
`ఇంద్ర`తో సంచలన విజయం అందుకున్న చిరంజీవి

బి గోపాల్‌ దర్శకత్వంలో వచ్చిన `ఇంద్ర` సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. 2002 జులై 24న విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది పెద్ద హిట్‌ మాత్రమే కాదు, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో ఆర్తి అగర్వాల్‌, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి నటించిన తొలి ఫ్యాక్షన్‌ మూవీ ఇదే కావడం విశేషం. అప్పటి వరకు బాలయ్య ఇలాంటి ఫ్యాక్షన్‌ మూవీస్‌ చేస్తూ వచ్చారు. `సమరసింహారెడ్డి`, `నరసింహ నాయుడు` వంటి చిత్రాలతో ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి కూడా `ఇంద్ర`తో ఫ్యాక్షన్‌ ట్రై చేశారు. ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు.

35
`ఇంద్ర` చేయాల్సిన హీరో బాలయ్య

అయితే ఈ సినిమా వెనుక పెద్ద కథే ఉంది. `ఇంద్ర` మూవీ మొదట అనుకున్న హీరో చిరంజీవి కాదు. ఫ్యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన బాలయ్యతోనే సినిమా చేయాలనుకున్నారు. దర్శకుడు బి గోపాల్‌, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` చిత్రాలు పెద్ద హిట్‌ కావడంతో మరోసారి వీరి కాంబినేషన్‌లో `ఇంద్ర` మూవీ చేయలనుకున్నారు. కానీ అప్పటికే బాలయ్య వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు.

45
బాలయ్య ఖాళీ లేకపోవడంతో చిరంజీవి వద్దకు `ఇంద్ర`

`సీమసింహం`, `చెన్నకేశవ రెడ్డి` వంటి చిత్రాలు సేమ్ జోనర్‌లోనే ఉన్నాయి. పైగా డేట్స్ లేవు. దీంతో బాలయ్య ఈ మూవీ చేయలేకపోయారు. దీంతో దర్శకుడు బి గోపాల్‌ నిర్మాత అశ్వినీదత్‌ వద్దకు వెళ్లగా, ఆయన చిరంజీవితో చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. మెగాస్టార్‌ ని ఈ కథతో కలవగా, ఆయన వెంటనే ఓకే చెప్పారు. అంతకు ముందు చిరు చేసిన `అన్నయ్య`, `మృగరాజు`, `శ్రీమంజునాథ`, `డాడీ` చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆదరణ పొందలేదు. చిరంజీవికి హిట్‌ పడి మూడేళ్లు అవుతుంది. దీంతో కొత్తగా ఉంటుందని `ఇంద్ర` కథకి ఓకే చెప్పారు.

55
ఇండస్ట్రీ హిట్‌గా `ఇంద్ర`

మెగాస్టార్‌ ఫ్యాక్షన్‌ మూవీ అనేసరికి ఫ్యాన్స్ లోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. ఇండస్ట్రీ వర్గాలు కూడా స్పెషల్‌గా చూశాయి. సినిమా కూడా అంతే బాగా వచ్చింది. రావడమే కాదు విడుదలయ్యాక బాక్సాఫీసు వద్ద ఊచకోత ప్రారంభించింది. ఈ చిత్రం పది కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా రూ.52కోట్లు వసూలు చేసింది. తెలుగులో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగులో యాభై కోట్లు రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది. 152 సెంటర్లలో 50 రోజులు ఆడింది. 122 సెంటర్లలో వంద రోజులు, 32 సెంటర్లలో 175 డేస్‌, సత్యం థియేటర్లో 247 రోజులు ఆడింది. ఇలా బాలయ్య ఒక ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకోగా, బాలయ్య వల్ల చిరంజీవికి కెరీర్‌ బెస్ట్ ఫిల్మ్ పడింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories