లావణ్య విషయంలో వరుణ్ చేసిన పనికి ఇప్పటికీ కోపంగా ఉన్న చిరంజీవి... నాగబాబు కొడుకు ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశాడు

First Published | Aug 12, 2024, 6:59 PM IST


లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో వరుణ్ తేజ్ పై చిరంజీవి ఇప్పటికీ కోపంగా ఉన్నారట. దానికి కారణం ఏమిటో ఓ సందర్భంలో ఆయనే స్వయంగా చెప్పారు.. 
 

chiranjeevi

మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ తర్వాత ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న హీరో వరుణ్ తేజ్. చిరంజీవి, నాగబాబు పెద్దలు కుదిర్చిన అమ్మాయిలను భార్యలుగా తెచ్చుకున్నారు. నిర్మాత అల్లు రామలింగయ్య...  అప్పటికి ఎలాంటి ఫేమ్ లేని చిరంజీవిని ఏరి కోరి అల్లుడిగా తెచ్చుకున్నాడు. నాగబాబు భార్య పద్మజ సినిమా నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చారు. 

పవన్ కళ్యాణ్ తనతో బద్రి, జానీ చిత్రాల్లో నటించిన రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ తో మనస్పర్థలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు ఇచ్చారు. అనంతరం రష్యన్ నటి అన్నా లెజినోవాను భార్యగా చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వలె వరుణ్ తన కో స్టార్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 


Varun Tej

2017లో విడుదలైన మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్-లావణ్య కలిసి నటించారు. అప్పటి పరిచయం స్నేహానికి దారి తీసింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది.  అనంతరం అంతరిక్షం అనే మరొక చిత్రంలో కలిసి నటించారు. ఏళ్ల తరబడి రహస్యంగా లావణ్య-వరుణ్ ప్రేమించుకున్నారు. కొన్నాళ్లుగా పుకార్లు చెలరేగాయి. అనూహ్యంగా లావణ్య త్రిపాఠి ఈ వార్తలను ఖండించారు. 

కట్ చేస్తే 2023లో నిశ్చితార్థం ప్రకటన చేశారు. అదే ఏడాది నవంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. ఇటలీ వేదిక వరుణ్ తేజ్-లావణ్యల వివాహం జరిగింది. మెగా ఫ్యామిలీ మాత్రమే ఈ పెళ్ళికి హాజరయ్యారు. అయితే లావణ్యతో వరుణ్ తేజ్ లవ్ విషయంలో చిరంజీవి కోప్పడ్డారట. అందుకు కారణం ఏమిటో చిరంజీవి ఓ వేడుకలో స్వయంగా వెల్లడించారు. 

వరుణ్ తేజ్ గత చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాంకర్ సుమ ఆయన్ని ఓ ప్రశ్న అడిగారు. చిరు లీక్స్ అంటే అందరికీ ఇష్టం. అన్ని విషయాలు లీక్ చేసే మీరు వరుణ్ తేజ్-లావణ్య లవ్ మేటర్ ఎందుకు లీక్ చేయలేదని అడిగింది. దానికి చిరంజీవి ఆసక్తికర సమాధానం చెప్పాడు. 

Chiraneevi

వరుణ్ తేజ్ ప్రతి విషయం నాకు చెబుతాడు. నేను తనకు స్ఫూర్తి అంటాడు. వాళ్ళ నాన్నతో చెప్పుకోలేని విషయాలు కూడా నాకు చెబుతాడు. అయితే లావణ్యతో ప్రేమ విషయం మాత్రం నాకు చెప్పలేదు. ఆ విషయంలో నాకు ఇప్పటికీ వాడి మీద కోపం ఉంది, అని చిరంజీవి అన్నారు. గౌరవంతో కూడిన భయం వలన నా ప్రేమ విషయం దాచాను. కానీ మొదట చెప్పింది పెదనాన్నకే అని వరుణ్ వివరణ ఇచ్చుకున్నాడు.. 

Latest Videos

click me!