ఒకే ఏడాది 7 సార్లు పోటీ పడ్డ కృష్ణ, చిరంజీవి..అడ్రస్ లేకుండా పోయిన సినిమాలు, పైచేయి ఎవరిదో తెలుసా

Published : Aug 15, 2025, 04:39 PM IST

చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ గతంలో ఒకే ఏడాది బాక్సాఫీస్ వద్ద ఏడుసార్లు పోటీ పడ్డారు. ఆ చిత్రాల రిజల్ట్స్ ఏంటి .. బాక్సాఫీస్ వార్ లో ఎవరు విజేతగా నిలిచారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. 

PREV
15
పోటా పోటీగా చిరంజీవి, కృష్ణ 

సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక చరిత్ర ఉంది. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమని శాసించిన హీరోలు వీరిద్దరూ. 80వ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చిరంజీవి సరికొత్త స్టార్ గా టాలీవుడ్ లో ఎదిగింది కూడా అప్పుడే. 80వ దశకంలో చిరంజీవి, కృష్ణ నటించిన చిత్రాలు పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి. 

DID YOU KNOW ?
కృష్ణ నటించాల్సిన చిత్రంలో చిరంజీవి 
చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించాల్సింది. కృష్ణ బిజీగా ఉండడం వల్ల ఆ చిత్రాన్ని వదులుకున్నారు. 
25
బాక్సాఫీస్ వార్ 

1984లో మాత్రం వీరిద్దరూ తమ చిత్రాలతో ఏకంగా 7 సార్లు బాక్సాఫీస్ వార్ కి దిగారు. ఈ పోటీలో విజయం ఎవరిది ? బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ ఆ చిత్రాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 1984 ఫిబ్రవరి 11 న చిరంజీవి నటించిన అల్లుళ్ళొస్తున్నారు చిత్రం విడుదలైంది. 5 రోజుల గ్యాప్ లో కృష్ణ నటించిన రక్తసంబంధం చిత్రం విడుదలయింది. ఈ మూవీలో కృష్ణ ట్రిపుల్ రోల్ లో నటించారు. చిరంజీవి అల్లుళ్ళొస్తున్నారు చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కృష్ణ రక్తసంబంధం మాత్రం యావరేజ్ గా నిలిచింది. 

35
ముఖ్యమంత్రిగా కృష్ణ, దేవాంతకుడిగా చిరంజీవి 

అదే ఏడాది మార్చి 23న చిరంజీవి నటించిన 'హీరో' చిత్రం రిలీజ్ అయింది. వారం గ్యాప్ లో కృష్ణ పులిజూదం చిత్రం రిలీజ్ అయింది. రెండూ యాక్షన్ చిత్రాలే. అయినప్పటికీ ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. ఏప్రిల్ 12న మరోసారి చిరంజీవి, కృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ జరిగింది. ఏప్రిల్ 12న చిరంజీవి దేవాంతకుడు చిత్రం విడుదలైంది. రెండు వారాల గ్యాప్ లో కృష్ణ తన ముఖ్యమంత్రి చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. 

45
ఛాలెంజ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ 

ఆ తర్వాత జూన్ 20న సూపర్ స్టార్ కృష్ణ కిరాయి అల్లుడు చిత్రం రిలీజ్ అయింది. వారం రోజుల గ్యాప్ లో చిరంజీవి మహానగరంలో మాయగాడు చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రం నిరాశ పరచగా కృష్ణ కిరాయి అల్లుడు చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఆగష్టు 9న చిరంజీవి ఛాలెంజ్ మూవీ రిలీజ్ అయింది. అదే రోజున కృష్ణ బంగారు కాపురం చిత్రం కూడా విడుదలైంది. చిరంజీవి ఛాలెంజ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కాగా కృష్ణ బంగారు కాపురం మూవీ ఆకట్టుకోలేకపోయింది. 

55
సమఉజ్జీలుగా చిరంజీవి, కృష్ణ 

సెప్టెంబర్ లో చిరంజీవి ఇంటిగుట్టు చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రానికి వారం ముందు విడుదలైన కృష్ణ ఉద్దండుడు చిత్రం ఫ్లాప్ అయింది. చిరంజీవి ఇంటి గుట్టు మాత్రం మంచి విజయం సాధించింది. సెప్టెంబర్ 28న కృష్ణ కంచు కాగడా చిత్రం రిలిజ్ అయింది. రెండు వారాల గ్యాప్ లో చిరంజీవి నాగు మూవీ విడుదలైంది. ఈ రెండు చిత్రాలు మంచి వసూళ్లనే రాబట్టాయి కానీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేక యావరేజ్ గా నిలిచాయి. ఈ విధంగా చిరంజీవి, కృష్ణ 1984లో ఏడుసార్లు పోటీ పడ్డప్పటికీ ఇద్దరూ మిక్స్డ్ రిజల్ట్స్ తో సమఉజ్జీలుగా నిలిచారు. 

Read more Photos on
click me!

Recommended Stories