చిరంజీవి, ఏఎన్నార్ ఓ హీరోయిన్ కి తెగ భయపడేవారట. ఆ హీరోయిన్ చిరంజీవి, ఏఎన్నార్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు తన నటనతో చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు అందించారు. అప్పట్లో మహానటి సావిత్రి నుంచి.. శ్రీదేవి వరకు ఎందరో గొప్ప నటీమణులతో ఏఎన్నార్ నటించారు. అదే విధంగా చిరంజీవి తన కెరీర్ లో రాధా, రాధిక. శ్రీదేవి, విజయశాంతి లాంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
25
హీరోయిన్ రాధిక శరత్ కుమార్
అయితే ఈ స్టార్ హీరోలని భయపెట్టిన హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఆమె ఎవరో కాదు రాధిక శరత్ కుమార్. రాధిక.. చిరంజీవితో అత్యధిక సినిమాల్లో నటించారు. దాదాపు 25 పైగా చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో ఉన్నాయి. అదే విధంగా రాధికా ఏఎన్నార్ తో కూడా కలిసి నటించారు.
35
చిరంజీవితో చాలా క్లోజ్
రాధిక చిరంజీవితో చాలా క్లోజ్ గా ఉండేవారట. ఇద్దరం ఎప్పుడూ సరదాగా గొడవపడుతుండేవాళ్ళం అని రాధిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవి సతీమణి సురేఖ తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది అని రాధిక తెలిపారు. నా కళ్ళముందు పెరిగిన రాంచరణ్ ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు అంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్ నటన చూసి ఆశ్చర్యపోయినట్లు రాధిక పేర్కొంది.
తాను హీరోలతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ ఒక లైన్ దాటి బిహేవ్ చేసేదాన్ని కాదు అని రాధికా అన్నారు. ఆ విషయంలో చాలా కఠినంగా ఉండేదాన్ని. అందుకే తనతో హీరోలు ఎవరూ హద్దులు దాటి ప్రవర్తించే వారు కాదు అని రాధిక అన్నారు. చిరంజీవి కూడా నాకు భయపడతారు. కానీ ఇద్దరం చాలా క్లోజ్ గా ఉంటాం. ఏఎన్నార్ కూడా ఒక సందర్భంలో వామ్మో రాధికతో జాగ్రత్తగా ఉండాలి అని అన్నారట.
55
చిరంజీవి నా కళ్ళముందే
చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది. చిరంజీవి నా కళ్ళ ముందే స్టార్ హీరోగా ఎదిగారు. ఖైదీ చిత్రంలో నేను నటించలేదు. కానీ ఆ మూవీతో చిరంజీవి స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరం చాలా సంతోషించాం. చిరంజీవి సక్సెస్ చూసి తాను గర్వపడినట్లు రాధిక పేర్కొంది.