మెగాస్టార్ చిరంజీవికి చిత్ర పరిశ్రమలో చాలామంది స్నేహితులు ఉన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో కూడా చిరంజీవికి మంచి మిత్రులు ఉన్నారు. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్, చిరంజీవి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్ళిద్దరూ గ్యాంగ్ లీడర్ చిత్రంలో కలిసి నటించారు.
ఓ ఇంటర్వ్యూలో శరత్ కుమార్ మాట్లాడుతూ చిరంజీవి స్నేహానికి విలువిచ్చే మనిషి అని ప్రశంసలు కురిపించారు. చిరంజీవి గొప్ప మనసు తాను కష్టాల్లో ఉన్నప్పుడు అర్థమైందని శరత్ కుమార్ తెలిపారు. గ్యాంగ్ లీడర్ మూవీలో నటిస్తున్న సమయంలో మీ తర్వాతి చిత్రాల్లో కూడా నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగేవాడిని. ఆయన ఏం అవసరం లేదురా నువ్వే హీరో అయిపోతావ్ చూడు అని చెప్పారు. ఆయన అన్నట్లుగానే నేను హీరో అయ్యాను.