Devatha: దేవి ప్రవర్తనతో కుమిలిపోతున్న చిన్మయి.. మాధవ్ కు విశ్వరూపం చూపించిన రుక్మిణి!

Published : Aug 29, 2022, 11:27 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 29వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
16
Devatha: దేవి ప్రవర్తనతో కుమిలిపోతున్న చిన్మయి.. మాధవ్ కు విశ్వరూపం చూపించిన రుక్మిణి!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. తాగుబోతు దగ్గరనుంచి దేవీ, రుక్మిణీలు ఇంటికి వస్తారు. అప్పుడు చిన్నయి ఎక్కడికి వెళ్లారు అని అడగగా మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి నేను మీ నాయన దగ్గరికి వెళ్లి మాట్లాడే పని ఉన్నది అని మాధవ్ దగ్గరికి వెళ్తుంది రుక్మిణి. అప్పటికే మాధవ్ గిటార్ వాయిస్తూ ఉండగా రుక్మిణి కోపంతో మాధవ్ మీద చేయి ఎత్తుతుంది నువ్వు నీ హద్దు దాటుతున్నావు రాధ అని అనగా రుక్మిణి చాలా కోపంతో ఎవరు హద్దు ఎవరు దాటుతున్నారు అసలు నీకు ఏమైనా బుద్ధి ఉందా.
 

26

చిన్న పిల్ల మనసు అలా పాడు చేయడానికి నీకు అలా మనసు ఎలా వస్తుంది. గుర్తుపెట్టుకో నా బిడ్డని ఎంత బాధ పడుతున్నావో అంతకన్నా ఎక్కువ బాధ నీకు తిరిగి వచ్చేలా చేస్తాను అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో చిన్మయి దేవి దగ్గరికి వచ్చి ఏమైంది దేవి ఈ మధ్య నాతో సరిగా ఆడడం లేదు మాట్లాడడం లేదు ఏం బాధలో ఉన్నావు అని అనగా మా నాయన మీ నాయన వేరు అని నీకు తెలిస్తే నువ్వు బాధ పడతావు ఇప్పుడు నేను అనుభవిస్తుంది నువ్వు అనుభవించడం నాకు ఇష్టం లేదు అక్క అని మనసులో అనుకుని ఏం లేదు అక్క అని అంటుంది.
 

36

అమ్మ నాన్నలు నిన్ను ఏమైనా అన్నారా నేను వెళ్లి మాట్లాడన? అని చిన్నవి అనగ నన్ను ఒంటరిగా వదిలే అక్క అని అంటుంది దేవి.ఈ మాటలన్నీ విన్న జానకమ్మ పిల్లలు అంత చెక్కగా ఆడుకునేవారు. వాళ్ళకి ఏమైంది ఇప్పుడు అసలేదో జరుగుతుంది అని అనుకుంటుంది. ఆ తర్వాత ఆదిత్య ఆఫీస్ లో ఉండగా రుక్మిణి ఏడుచుకుంటూ ఆదిత్య ని వెళ్లి హద్దుకుంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడగవుగా జరిగింది అంతా చెప్తుంది. బాధపడొద్దు నేను వెళ్తాను జరిగిందో ఏంటో కనుక్కుంటాను అని  ఆ తాగుబోతు ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ వాడు ఉండడు చుట్టుపక్కల వాళ్ళు కూడా వాడిని చూడరు.
 

46

ఇక్కడ ఎవరికీ వాడు తెలీదంటే ఈమధ్యనే ఇక్కడికి వచ్చినట్టున్నాడు ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అని ఆదిత్య అనుకుంటాడు.ఆ తర్వాత సీన్లో దేవుడమ్మ, సత్య కి పువ్వులు పెడుతూ మీ సంగతే ఏమైంది అమ్మ అమెరికా వెళ్తా అన్నారు అని అడగగా ఆదిత్యకి ఇష్టం లేదు ఆంటీ పిల్లలు కావాలని అన్నాడు వెళ్లడానికి కూడా ఆసక్తి చూపించాలి కదా అని అంటుంది. ఈ ఇంట్లో పిల్లల కేరింతలు వినాలని అనుకున్నాను. ఇప్పుడు కమల వల్ల కోరిక తీరింది అలాగే నువ్వు కూడా బిడ్డని తెస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా అని దేవుడమ్మ అంటుంది.
 

56

మీరే అలా అంటున్నారు నాకు సొంత పిల్లలు కావాలని ఉండదా చెప్పండి ఆంటీ. కానీ ఆదిత్యకి అర్థం కావడం లేదు నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను నాకు మాత్రమే తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో దేవి రుక్మిణి దగ్గరికి వచ్చి అమ్మ, ఇందాక వర్షం పడింది కదా నాయన ఆ వర్షంలో తడుస్తూ ఉంటాడు కదా. అసలకే చిన్న ఇల్లు  కదా అమ్మ అంటుంది. ఇంతట్లో చిన్మయ అక్కడికి వచ్చి అమ్మా ఈ మధ్య దేవి సరిగ్గా ఉండడం లేదు ఏమైందమ్మా అని అనగా రుక్మిణి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవి ఏమో ఇలా ఉన్న,,ది అమ్మేమో అలా ఉన్నది అసలు ఏం జరుగుతుంది అని చిన్మయి బాధపడుతుంది.
 

66

తర్వాత సీన్ లో మీరు అమెరికా ఎప్పుడు వెళ్తున్నారు నీకు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి కదా ఇంకో మూడు రోజులు సెలవు పెట్టి వారం రోజులు అమెరికా వెళ్లి ఆ పని చేసుకుని రండి అని  డేవుడమ్మ అనగా ఇప్పుడు పిల్లలు లేకపోతే మనుషులు చచ్చిపోతారా. సెలవులు ఉంటే అక్కడికే వెళ్లాలా అని అరిచి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఆదిత్య ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు ఎందుకిలాగున్నాడు అని ఆలోచనలో పడుతుంది దేవుడమ్మ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories