ఇక్కడ మాత్రం వ్యక్తిగత భద్రతకంటే సంపాదనవైపే మొగ్గు చూపావేమో అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.. ఘాటుగా అనేస్తున్నారు. ఇక వీరి వ్యాఖ్యలకు ఆమె కూడా ఘాటుగానే సమాధానం చెపుతోంది. మంచి కెరీర్, డబ్బు సంపాదిస్తున్న వారిని చూసి నీ ఇగో హర్ట్ అయింది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నువ్వు, ట్విట్టర్ కనుమరుగయ్యాక కూడా నేను పాడిన పాటలు వినిపిస్తూనే ఉంటాయి అన్నారు. అంతే కాదు ఇండియాలో సెక్యూరిటీ లేక దేశాన్ని వీడానని ఓ మహిళ అంటే ఇలా స్పందిస్తారా? అసలు ఇండియాను వీడి వెళ్లాల్సింది నువ్వే అంటు ట్రోలర్ కు చాలా ఘాటుగా సమాధానం చెప్పింది.