ఇక తెలుగులో థియేట్రికల్ రైట్స్ విషయంలో నెవర్ బిఫోర్ బిజినెస్ జరగనుంది. అయితే ఆదిపురుష్ చిత్రంతో తన స్నేహితులు యువి క్రియేషన్స్ నిర్మాతలు వంశి, ప్రమోద్ లకు లబ్ది చేకూర్చాలని ప్రభాస్ ప్రయత్నించాడు. కానీ అది ఎలా బెడిసికొట్టిందో చూశాం. దీనితో ప్రభాస్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై బిజినెస్ వ్యవహారాల్లో తాను తలదూర్చకూడదని అనుకుంటున్నాడట.