ప్రభాస్ పై నోరు జారిన హీరోకు రేవంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్

First Published | Aug 19, 2024, 7:53 AM IST

ప్రభాస్ బాహుబలి అనే సినిమాని ఇచ్చి మన జాతీయ ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. ఇప్పుడు కల్కి 2898 ఎడి తో మన సినిమా హాలీవుడ్ సినిమాతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. 


 “కల్కి 2898 ఎడి” అనే సినిమాతో ప్రభాస్ నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయారు.  ఏకంగా 1100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా దగ్గర 1000 కోట్ల వసూళ్లు ఉన్న టాప్ 3 హీరోస్ లో ఒకడిగా నిలిచాడు. అది చాలా మంది బాలీవుడ్ జనాలకు డైజస్ట్ కావటం లేదు.  ఈ క్రమంలో కొందరు లోలోపలే ఏడుస్తూంటే అర్షద్ వర్సి వంటి హీరోలు డైరక్ట్ గా తమ అసూయను బయిటపెట్టుకుంటున్నారు.  మున్నాభాయ్ ఎంబీబీయస్ లో సర్క్యూట్ గా కనిపించిన అర్షద్ వర్శి  ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ హీరోగా చేసారు. అయితే ఇప్పుడు పూర్తిగా మార్కెట్ లో వెనకబడ్డాడు.
 


బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలే అక్కడ ఆడటం లేదు. అలాంటిది అర్షద్ వర్శి వంటి చిన్న కామెడీ హీరోకు దిక్కు ఏముంది. పూర్తి ఖాళీ పడ్డాడు. దాంతో నార్త్ లో హిట్స్ కొడుతున్న సౌత్ హీరోలు, డైరక్టర్స్ అంటే వాళ్లకి మండిపోతోంది. ప్రభాస్ బాహుబలితో నార్త్ లో జెండా పాతితే పుష్పతో అల్లు అర్జున్ కొనసాగించారు. అలాగే కేజీఎఫ్, కాంతారా వంటి చిత్రాలు అక్కడ సూపర్ హిట్ అయ్యాయి. ఆర్. ఆర్. ఆర్ ప్రభంజనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
 

Latest Videos



ప్రభాస్ యావరేజ్ సినిమాలు సాహో వంటివి  సైతం అక్కడ భీబత్సం సృష్టిస్తున్నాయి.  ఈక్రమంలో అది చూసి ఓర్వలేక మాట్లాడుతున్నట్లుగా ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ అర్శద్ వార్శి అభ్యంతరకర కామెంట్స్ చేయడం ఇపుడు ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యింది. అయితే అర్షద్ నోరు జారడంపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియాలో జనం అంటున్నారు. అయితే నిజానికి రేవంత్ రెడ్డి కావాలని అర్శద్ వార్శి మాటలకు కౌంటర్ ఇవ్వలేదు. అయితే అర్దద్ వార్శి మాట్లాడిన కొద్ది గంటల్లోనే తెలంగాణా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్టేజిపై ప్రభాస్ గురించి చెప్పిన మాటలు, ఎలివేషన్స్ ఓ రేంజిలో వైరల్ అవ్వటం మొదలయ్యాయి. 
 


ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ (Hyderabad) గ‌చ్చిబౌలిలో క్ష‌త్రియ సేవా స‌మితి (Kshatriya Sevasamithi) అధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన అభినంద‌న స‌భ‌కు  సీఎం రేవంత్ రెడ్డి  ముఖ్య అతిథిగా హ‌జ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కృష్ణంరాజు, ప్రభాస్, రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

కృష్ణంరాజు (Krishnam Raju)పేరు లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోలేమని, మొట్ట‌మొద‌టి సారిగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ వరకు సత్తా చాటిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అని త‌న‌కు మంచి మిత్రుడ‌ని, అదేవిధంగా బాలీవుడ్‌ను దాటి మ‌న‌ టాలీవుడ్‌ హాలీవుడ్‌తో పోటీ ప‌డి రాణించ‌డిన చిత్రం బాహుబ‌లి (Baahubali). అందుకు కార‌ణం ప్ర‌భాస్ (Prabhas). తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన ఈ సినిమాలో ప్రభాస్‌ లేకుండా బాహుబలి పాత్రను ఊహించలేమని రేవంత్ రెడ్డి అన్నారు. వీట‌న్నింటికీ, వారు రాణించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం, వారి క‌ఠోర శ్ర‌మ‌, కష్టపడేతత్వమేన‌ని సిఎం‌‌ రేవంత్ రెడ్డి స్ఫ‌ష్టం చేశారు. 
 


ఇలా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రభాస్ గురించి చెప్పటం, అదీ అర్శద్ వార్సి విమర్శలు చేసిన సమయంలోనే కావటం యాధృచ్చికం అయినా కరెక్ట్ కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది. దాంతో ఆ వీడియోని షేర్ చేస్తూ అభిమానులు ప్రభాస్ ని  టార్గెట్ చేసే బదులు మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటే బెటర్ అంటున్నారు. ప్రభాస్ బాహుబలి అనే సినిమాని ఇచ్చి మన జాతీయ ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. ఇప్పుడు కల్కి 2898 ఎడి తో మన సినిమా హాలీవుడ్ సినిమాతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. కాబట్టి ఆ కష్టాన్ని విమర్శించే బదులు మీరు కూడా ఆ స్దాయికి వెళ్లండని పోస్ట్ లు పెడుతున్నారు. మరో ప్రక్క ప్రభాస్ ఫ్యాన్స్ అంతా రేవంత్ రెడ్డిని తెగ పొగుడుతున్నారు.

click me!