Chennai Love Story OTT: ఐదు భాషల్లో చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్.. ఓటీటీకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం సినిమా

Published : Aug 21, 2026, 12:23 PM IST

Chennai Love Story: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేసింది. సోనీ లివ్‌లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

PREV
15
Chennai Love Story

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు అధికారికంగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఏకంగా ఐదు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

25
రవి నంబూరి దర్శకత్వంలో సినిమా

చెన్నై లవ్ స్టోరీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. కథను బేబీ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ అందించారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా, త్రిగుణ్, దేవి ప్రసాద్, సిరి హనుమంతు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమాకు సంబంధించిన కథ, పాత్రలు, రొమాంటిక్ అంశాలు థియేటర్లలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పుడు అదే చిత్రాన్ని ఇంటి నుంచే చూసే అవకాశం ఓటీటీ ప్రేక్షకులకు లభించింది.

35
ఐదు భాషల్లో స్ట్రీమింగ్

చెన్నై లవ్ స్టోరీకి సంబంధించిన మరో ప్రత్యేకత ఐదు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కావడం. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సోనీ లివ్‌లో సినిమా అందుబాటులో ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతోపాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ రొమాంటిక్ డ్రామాను చూసే అవకాశం ఏర్పడింది. థియేటర్లలో ఒక స్థాయి ప్రేక్షకాదరణ పొందిన సినిమా ఇప్పుడు డిజిటల్ స్టీజీపై ఎలాంటి స్పందనను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వివిధ భాషల్లో స్ట్రీమింగ్ కావడం వల్ల సినిమాకు థియేట్రికల్ రిలీజ్‌తో పోలిస్తే మరింత విస్తృతమైన ప్రేక్షక వర్గం చేరువ కానుంది.

45
సాయి రాజేష్, ఎస్‌కేఎన్ నిర్మాణంలో..

ఈ సినిమాను ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు. సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అందించారు. సినిమాలో ప్రధాన నటీనటులతోపాటు సహాయ పాత్రల్లో నటించిన నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా కథకు కీలకంగా నిలిచింది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ అందించడం, మణిశర్మ సంగీతం అందించడం వంటి అంశాలు సినిమాపై ప్రారంభం నుంచే ఆసక్తిని పెంచాయి. థియేటర్లలో తన వంతు ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

55
ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో..

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ నటించిన చెన్నై లవ్ స్టోరీ ప్రస్తుతం సోనీ లివ్‌లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ తర్వాత డిజిటల్ స్టీజీపైకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి. ఎమోషనల్ రొమాంటిక్ సినిమాలు ఇష్టపడే వారు మిస్ కాకుండా ఈ సినిమాని చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories